Camel flu Qatar : ఫిఫా వరల్డ్​ కప్​ కోసం ఖతార్​ వెళుతున్నారా? అయితే జాగ్రత్త!-fans at 2022 world cup in qatar at high risk of camel flu infection report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Fans At 2022 World Cup In Qatar At High Risk Of 'Camel Flu' Infection: Report

Camel flu Qatar : ఫిఫా వరల్డ్​ కప్​ కోసం ఖతార్​ వెళుతున్నారా? అయితే జాగ్రత్త!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 27, 2022 07:55 AM IST

Camel flu Qatar : కొవిడ్ సంక్షోభం​ తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్​గా గుర్తింపు తెచ్చుకుంది 2022 ఫిఫా వరల్డ్​ కప్​. వరల్డ్​ కప్​ చూసేందుకు ఖతార్​ వెళ్లాలని భావిస్తున్నారా? అయితే.. వివిధ వ్యాధులు మీకు స్వాగతం పలికే ప్రమాదం ఉంది!

ఖతార్​లో.. ఓ మెస్సీ అభిమాని
ఖతార్​లో.. ఓ మెస్సీ అభిమాని (REUTERS)

Camel flu Qatar : 2022 ఫిఫా వరల్డ్​ కప్​ను చూసేందుకు లక్షలాది మంది ప్రజలు.. ఖతార్​కు తరలివెళుతున్నారు. ఈ క్రమంలో.. ఖతార్​కు వెళ్లాలని భావిస్తున్న వారందరికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధారిత పరిశోధకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖతార్​కు వెళితే.. వినోదంతో పాటు కొవిడ్​, మంకీపాక్స్​ వంటి రోగాలు కూడా సోకుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రమాదకరమైన 'కామెల్​ ఫ్లూ' కూడా సోకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

జాగ్రత్తగా ఉండండి.. లేదంటే..!

ఫిఫా వరల్డ్​ కప్​ నేపథ్యంలో.. న్యూ మైక్రోబ్స్​ అండ్​ న్యూ ఇన్​ఫెక్షన్స్​ జర్నల్​లో ఓ అధ్యాయనం​ ఇటీవలే ప్రచురితమైంది. ఖతార్​లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడటంతో.. వివిధ రోగాలు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆటగాళ్లు, అభిమానులు, స్థానికులకు ఇది మంచిది కాదని సూచిస్తున్నారు.

2022 FIFA world cup Qatar : ఈ కామెల్​ ఫ్లూను ఎమ్​ఈఆర్​ఎస్​(మిడిల్​ ఈస్ట్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​) అని కూడా పిలుస్తున్నారు. కొవిడ్​లాగానే.. ఇది కూడా భవిష్యత్తులో మహమ్మారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే హెచ్చరించింది. ఖతార్​కు సరిహద్దు దేశమైన సౌదీ అరేబియాలో.. 2012లో తొలిసారిగా ఈ ఎమ్​ఈఆర్​ఎస్​ను గుర్తించారు. అప్పటి నుంచి 2600 కేసులు వెలుగులోకి వచ్చాయి. 27 దేశాల్లో 935మంది మరణించారు. జ్వరం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు, దగ్గు వంటివి సాధారణ లక్షణాలుగా ఉన్నాయి.

ఖతార్​కు వెళుతున్న ప్రజలు.. అక్కడి ఒంటెలను ముట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒంటెల నుంచే ఈ కామెల్​ ఫ్లూ పుట్టుకొచ్చిందని వారు చెబుతున్నారు.

కామెల్​ ఫ్లూ, కొవిడ్​తో పాటు.. లెష్మనైసిస్​, డెంగ్యూ, రేబీస్​, మీజిల్స్​, హెపటైటిస్​ ఏ,బీ, డయేరియా వంటి రోగాల బారిన కూడా ప్రజలు పడే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు.

ఖతార్​కు.. 1.2మిలియన్​ మంది!

Camel flu FIFA world cup : 2022 ఫిఫా వరల్డ్​ కప్​ను చూసేందుకు.. ప్రపంచ నలుమూలల నుంచి 1.2మిలియన్​ మంది ఖతార్​కు ప్రయాణిస్తారని అంచనా. ఇప్పటికే ఈ గల్ఫ్​ నేషన్​లో 2.8మిలియన్​ మంది ప్రజలు నివాసముంటున్నారు. కొవిడ్​ తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్​లో పాల్గొనేందుకు భారీ సంఖ్యల్లో ప్రజలు పోటీపడతారని, ఫలితంగా రోగాలకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కొనే విధంగా.. తన ఆరోగ్య వ్యవస్థను ఖతార్​ రూపొందించుకుందని.. కానీ నిరంతర నిఘా, పరిశోధనలు చేస్తేనే ఫలితం దక్కుతుందని స్టెడీ పేర్కొంది. ఖతార్​కు వెళ్లే వారు.. తరచూ టీకాలు తీసుకోవాలని, ఫుడ్​- డ్రింక్స్​ను తీసుకునే ముందు జాగ్రత్త వహించాలని సూచించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం