FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం.. దుమ్మురేపిన BTS జంగ్ కూక్-fifa world cup 2022 opening ceremony highlights ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Fifa World Cup 2022 Opening Ceremony Highlights

FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం.. దుమ్మురేపిన BTS జంగ్ కూక్

HT Telugu Desk HT Telugu
Nov 20, 2022 11:27 PM IST

FIFA World Cup 2022 Opening Ceremony : ఫుట్ బాల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సాకర్ పండుగ రానే వచ్చింది. ఖతర్ వేదికగా గ్రాండ్ గా ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2022 ప్రారంభమైంది.

ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం
ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం (twitter)

ప్రపంచం మెుత్తం అబ్బురపడే అత్యద్భుత ఘట్టం మెుదలైంది. ఫుట్ బాల్ ఫ్యాన్స్(Foot Ball Fans) ఎప్పటి నుంచో రావాలనుకున్న టైమ్ వచ్చింది. ఖతర్(Qatar) లోని అల్ ఖోరోలోని అల్ బైట్ స్టేడియంలో ఫిఫా వరల్డ్ కప్(qatar fifa world cup) ప్రారంభమైంది. ఎడారి దేశంలో మెగా క్రీడా సంబరానికి విజిల్ మోగింది. ఇక నుంచి ఫ్యాన్స్ ఈలలు, అరుపులతో ప్రపంచమంతా సాకర్ సంగ్రామం చప్పుడు వినిపించనుంది. ఫిఫా వరల్డ్ కప్ 2022 వేదిక దగ్గర అద్భుతమైన లైట్ వర్క్ అందరినీ ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్లే చేసిన సంగీతాన్ని కూడా ప్రదర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

మోర్గాన్ ఫ్రీమాన్, BTS గాయకుడు జంగ్ కుక్(bts jungkook) అద్భుతమైన ప్రదర్శనలతో కన్నులు తిప్పుకోకుండా చేశారు. ఫిఫా ఫ్యాన్స్ కు గొప్ప అనుభూతిని అందించారు. అంతకుముందు ఫ్రాన్స్ లెజెండ్ మార్సెల్ డిసైలీ ప్రపంచకప్ ట్రోఫీని అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రదర్శనలు చేశారు.

FIFA ప్రపంచ కప్ పాటల తర్వాత, BTS గాయకుడు జంగ్ కూక్ స్టేజీపైకి చేరుకున్నాడు. ఇక ప్రేక్షకులను తన ప్రదర్శనతో కట్టిపడేశాడు. డ్రీమర్స్ అనే ట్రాక్‌ను ప్రదర్శించగా.. అతడితోపాటుగా ఖతారీ గాయకుడు ఫహద్ అల్ కుబైసీ ఉన్నాడు. ఇలా... ఫిఫా వరల్డ్ కప్ అల్ బైత్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. సాంస్కృతిక ప్రదర్శనతో ప్రారంభోత్సవం మెుదలైంది.

ఖతర్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఫుట్ బాల్ ప్రపంచకప్ జరుగుతుంది. నాలుగు వారాల పాటు ఫుట్ బాల్ ప్రియులను అలరించనుంది. ఫుట్ బాల్ సంగ్రామంలో 32 జట్లు తలపడుతాయి. ఫుట్ బాల్(Foot Ball) చరిత్రలో మెుదటిసారిగా ఖతర్ ప్రపంచ కప్ కు ఆతిథ్యమిస్తోంది. మెుదటి మ్యాచ్ కూడా.. ఈక్వెడార్ తో ఆతిథ్య ఖతర్ జట్టు మధ్య ఉంది. ఫిఫా వరల్డ్ కప్ కోసం.. ఖతర్ అత్యాధునిక స్డేడియాలు నిర్మించిన విషయం తెలిసిందే.

WhatsApp channel

సంబంధిత కథనం