FIFA World Cup 2022 : ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్‌.. తెలంగాణ వాళ్ల మీద ఎఫెక్ట్ ఏంటి? -fifa world cup 2022 effect on telangana people see how ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Fifa World Cup 2022 Effect On Telangana People See How

FIFA World Cup 2022 : ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్‌.. తెలంగాణ వాళ్ల మీద ఎఫెక్ట్ ఏంటి?

HT Telugu Desk HT Telugu
Nov 10, 2022 03:15 PM IST

FIFA World Cup Qatar 2022 : నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు ఫిఫా వరల్డ్ కప్-2022 ఖతర్‌లో జరగనుంది. దీంతో చాలామంది తెలంగాణ వాళ్ల మీద దీని ప్రభావం ఉండనుంది. మెుదటిసారిగా ఆతిథ్యం ఇవ్వడానికి ఖతర్ సిద్ధమవుతున్న తరుణంలో అక్కడ నివాసం ఉంటున్న వాళ్లపై ఎఫెక్ట్ పడనుంది.

ఫిఫా వరల్డ్ కప్
ఫిఫా వరల్డ్ కప్

ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) ఖతర్ లో జరగనుంది. మెుదటిసారిగా అక్కడ ఆతిథ్యం ఇస్తున్నారు. ఖతర్ జట్టు(Qatar Team) తొలిసారిగా పాల్గొంటొంది. అయితే ఫిఫా ప్రపంచ కప్ తో తెలంగాణ(Telangana)కు చెందిన వారి మీద ప్రభావం పడుతుంది. డ్రైవర్లుగా, పనిమనుషులుగా, నిర్మాణ ప్రాజెక్టులలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన గల్ఫ్ కార్మికులు గందరగోళంలో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రపంచ కప్‌కి సంబంధించి గత మూడు సంవత్సరాలుగా నిర్మాణ, ఇతర రంగాలలోని కార్మికులకు ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టేడియాలు, కొత్త రోడ్లకు సంబంధించిన అన్ని నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఇప్పుడు సమస్యలు మొదలయ్యాయి. ప్రస్తుతం, చాలా మంది ఉచిత వీసా కార్మికులు ప్రధాన నగరాల శివార్లలో ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. వారు నగరాల్లోని గదుల నుండి ఖాళీ చేశారు. శివార్లలో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. నగరాల్లో రెట్లు పెరిగిన గదుల అద్దెలను కార్మికులు చెల్లించలేకపోతున్నారు.

గతంలో కరీంనగర్(Karimnagar), నిజామాబాద్, వరంగల్(Warangal), ఆదిలాబాద్ జిల్లాల నుండి దాదాపు 23,000 మంది కార్మికులు ఖతర్ ప్రపంచ కప్‌కు సంబంధించిన నిర్మాణం, ఇతర సంబంధిత పనులలో ప్రధానంగా నిమగ్నమై ఉన్నారని అంచనాగా తెలుస్తోంది.

ప్రభుత్వం(Govt) వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో కొందరు ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఇదిలా ఉండగా రియల్‌ ఎస్టేట్‌(Real Estate) సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి తిరిగి రావాలని కోరారు. ఇది మాత్రం కొంతమందికి ఉపశమనంగా ఉంది. అంతర్జాతీయ క్రీడాకారులు, అధికారులు, పర్యాటకుల బసను నిర్వహించే హోటల్‌లు, టూరిజం, ఏజెన్సీలలో తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రపంచకప్‌(World Cup) కారణంగా తమకు వసతి సమస్యలు ఎదురవుతున్నాయని ఖతర్‌లోని నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న సిరిసిల్లకు చెందిన వ్యక్తి చెప్పాడు. గతంలో ఐదుగురు మాత్రమే ఉండే చిన్న గదిలో ఇప్పుడు చాలా మంది ఉండాల్సి వస్తుందన్నారు. ఫుట్ బాల్ మ్యాచ్(Football)లకు సంబంధించి.. నిర్మాణ పనులు, ఇతర పనులు లేకపోవడంతో కొంతమందిని ఇంటికి పంపించేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉపాధి కోల్పోకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖతర్ ప్రభుత్వంతో మాట్లాడాలని పలువురు కోరుతున్నారు.

92 ఏళ్ల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో ఖతర్‌ జట్టు మెుదటిసారిగా ఆడుతోంది. గతంలో ఏనాడూ ఖతర్‌ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత దక్కలేదు. ఆతిథ్య దేశం హోదాలో నేరుగా టోర్నీలో ఆడే ఛాన్స్ దొరికింది. వరల్డ్ కప్ లో పోటీ పడుతున్న 32 జట్లలో ఖతర్‌ మినహా మిగతా 31 దేశాలు గతంలో ఒక్కసారైనా టోర్నీలో బరిలోకి దిగాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం