Deepika Padukone 82°E criticised: దీపికా పదుకోన్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌.. మాయిశ్చరైజర్‌కు అంత ధరా?-deepika padukone criticised for very high pricing of her skin care products ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika Padukone 82°e Criticised: దీపికా పదుకోన్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌.. మాయిశ్చరైజర్‌కు అంత ధరా?

Deepika Padukone 82°E criticised: దీపికా పదుకోన్‌ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌.. మాయిశ్చరైజర్‌కు అంత ధరా?

HT Telugu Desk HT Telugu
Nov 17, 2022 10:17 AM IST

Deepika Padukone 82°E criticised: దీపికా పదుకోన్‌ను ఫ్యాన్స్‌ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె సొంతంగా 82°E పేరుతో స్కిన్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీటి ధరలపై ఆమె విమర్శలు ఎదుర్కొంటోంది.

సొంత బ్రాండ్ 82°E లాంచ్ విమర్శల పాలవుతున్న దీపికా పదుకోన్
సొంత బ్రాండ్ 82°E లాంచ్ విమర్శల పాలవుతున్న దీపికా పదుకోన్ (AP)

Deepika Padukone 82°E criticised: బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్‌ ఇప్పుడు బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఆమె కొత్తగా 82°E పేరుతో సొంతంగా స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ను లాంచ్ చేసింది. మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ లోషన్‌లాంటివి ఇందులో ఉన్నాయి. మాయిశ్చరైజర్‌ పేరు అశ్వగంధ బౌన్స్‌ కాగా.. సన్‌స్క్రీన్‌ లోషన్‌ పేరు పచౌలీ గ్లో.

మన భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని వివరిస్తూ దీపికా తన కొత్త ప్రోడక్ట్స్‌ను లాంచ్‌ చేసింది. బుధవారం (నవంబర్ 16) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను ఆమె పోస్ట్‌ చేస్తూ.. తన ప్రోడక్ట్స్‌ను పరిచయం చేసింది. తన ప్రోడక్ట్స్‌కు ఆ పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ను ఎందుకు లాంచ్‌ చేయాలనుకున్నది ఆమె అందులో వివరించింది.

ఈ ప్రోడక్ట్స్‌ అప్పుడే మార్కెట్‌లోకి వచ్చేశాయి. అయితే వీటి ధరలు చూస్తే దిమ్మదిరగడం ఖాయం. ఇవి చూసిన నెటిజన్లు దీపికాను దారుణంగా ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. దీపికా పదుకోన్‌ మాయిశ్చరైజర్‌ ధరెంతో తెలుసా.. రూ.2700. ఇక సన్‌స్క్రీన్‌ లోషన్‌ ధర రూ.1800. ఈ ధరలు చూసిన వారు కళ్లు తేలేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అత్యుత్తమ ప్రోడక్ట్స్‌ కంటే కూడా వీటి ధర చాలా ఎక్కువ అంటూ ఓ యూజర్‌ ట్వీట్‌ చేశారు.

50 ఎంఎల్‌ మాయిశ్చరైజర్‌కు రూ.2700 ఎవరు పెడతారంటూ మరో యూజర్‌ ప్రశ్నించారు. మరొకరు కత్రినా కైఫ్‌తో పోలుస్తూ.. ఆమె ప్రోడక్ట్స్‌ చాలా బెటర్‌గా, అందుబాటు ధరల్లోనే ఉన్నాయని అన్నారు. సెలబ్రిటీ బ్రాండ్ల నుంచి ఇంతకన్నా మనం ఆశించేది ఏముంటుంది అంటూ ఇంకో యూజర్‌ కామెంట్‌ చేశారు. 30 ఎంఎల్‌ సన్‌స్క్రీన్‌కు రూ.1800 ధర పెట్టి కొనాలని దీపికా భావిస్తోందా? అది జరిగే పనేనా అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు.

నిజానికి హాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఇలా తమ సొంత బ్రాండ్లను లాంచ్‌ చేస్తూనే ఉంటారు. ఒకరకంగా దీపికానే కాస్త ఆలస్యంగా ఇందులోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్‌, ఆలియా భట్‌లాంటి వాళ్లు సొంత ప్రోడక్ట్స్‌ను లాంచ్ చేశారు. అయితే దీపికాలాగా వాళ్లు సామన్యులకు అందుబాటులో లేని ధరలను మాత్రం పెట్టలేదు.

Whats_app_banner