Beast movie | ఖతర్‌లో విజయ్ బీస్ట్‌ చిత్రం నిషేధం.. కారణం ఇదే-hero vijay beast movie banned in qatar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Beast Movie | ఖతర్‌లో విజయ్ బీస్ట్‌ చిత్రం నిషేధం.. కారణం ఇదే

Beast movie | ఖతర్‌లో విజయ్ బీస్ట్‌ చిత్రం నిషేధం.. కారణం ఇదే

HT Telugu Desk HT Telugu
Apr 12, 2022 08:49 AM IST

విజయ్ హీరోగా నటించిన చిత్ర బీస్ట్. తాజాగా ఈ సినిమాను ఖతర్ దేశంలో నిషేధించారు. తమిళంతో పాటు ఐదు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందీ చిత్రబృందం.

బీస్ట్
బీస్ట్ (Twitter)

ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో విజయ్ రా అధికారిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన పాటలన్నింటికీ మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా అరబిక్ కుతు సాంగ్ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రానికి కొత్త కష్టాలొస్తున్నాయి. ఈ సినిమా విడుదలను కొన్ని దేశాలు నిషేధించాయి.

ఈ చిత్ర కథాంశం ఇస్లామిక్ టెర్రరిజం నేపథ్యంలో ఉందని ఖతర్ దేశం నిషేధించింది. అంతకుముందుకు ఇదే కారణంతో కువైట్ కూడా బీస్ట్ సినిమాను విడుదల కాకుండా బ్యాన్ వేటు వేసింది. తాజాగా ఖతర్ కూడా అడ్డుకోవడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

పూజాహెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్నే ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషించారు. ఇందులో విజయ్ ఇండియన్ గూఢచార సంస్థ రా(RAW).. అధికారిగా కనిపించనున్నారు.

బీస్ట్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చారు. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యోగి బాబు, రాదిన్ కింగ్ స్లే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్