Kerala FIFA world cup : ‘ఫుట్‌బాల్‌కు ఇంత క్రేజా? ఇస్లాం మతానికి ఇది వ్యతిరేకం’
Kerala FIFA world cup : ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో కేరళలో ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. ఫుట్‌బాల్ కారణంగా యువత చదువుకోవడం లేదని ముస్లిం పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఫుట్‌బాల్‌ను, ఆటగాళ్లను పూజించడం అనేది ఇస్లాం మతానికి వ్యతిరేకం అంటున్నారు.
Kerala FIFA world cup : కేరళలో ఫుట్‌బాల్‌కి ఉన్న క్రేజ్ చూస్తుంటే మైండ్ పోతోంది! ఇక ఫీఫా వరల్డ్ కప్‌ను కేరళలోని యువత బాగా ఫాలో అవుతోంది. తమ అభిమాన ఆటగాళ్ల ఫ్లెక్సీలు వేసి మరీ సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు. అంతేకాకుండా.. వివిధ జట్ల అభిమానుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇది ఇలా ఉండగా.. కేరళలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్‌పై స్పందించారు అక్కడి ముస్లిం పెద్దలు. ఫుట్‌బాల్‌ను దైవంతో సమానంగా చూస్తూ, ప్రార్థనలు చేయడం.. ఇస్లాం మతాచారాలకు వ్యతిరేకం అని మండిపడుతున్నారు. గతంలో వలసలతో ఇతర దేశాలపై పడిన పోర్చుగల్ వంటి దేశాల జెండాలు పట్టుకుని తిరగడం సరికాదని అభిప్రాయపడ్డారు.
సమస్త కేరళ జామ్ ఇయ్యాతుల్ ఉలామాకు చెందిన కుత్బా కమిటీ ప్రధాన కార్యదర్శి నాజర్ ఫైజీ.. ఈ విషయంపై స్పందించారు. భారీ ఖర్చులు పెట్టి.. ఆటగాళ్ల కటౌట్లు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు.
Football world cup 2022 : "చాలా దేశాలను పోర్చుగల్ పాలించింది. అలాంటి దేశం జెండా ఎగరేయడం సరికాదు. అదే సమయంలో.. ఇతర దేశాల జెండాను ఎగరేయడం భారతీయులకు సరైనది కాదు. ఖతార్‌లో ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంటే.. ఇక్కడి విద్యార్థులు చదువుపై శ్రద్ధను కోల్పోతున్నారు. నేను ఫుట్‌బాల్‌కు వ్యతిరేకం కాదు. కానీ క్రీడను క్రీడగానే చూడాలి. మతంలా భావించి పూజలు చేయకూడదు. వ్యసనంగా మారకూడదు. ఇది మంచిది కాదు," అని నాజర్ అన్నారు.
"దేశాన్ని ప్రేమించడం మానేసి.. ఫుట్‌బాల్ స్టార్స్‌ను దైవంగా భావిస్తున్నారు. ఇస్లాంలో.. ఎవరికి ప్రార్థనలు చేయాలి అనే అంశంపై ఓ లిమిట్ ఉంటుంది," అని నాజర్ స్పష్టం చేశారు.
Football world cup Kerala : నాజర్ వ్యాఖ్యలను.. ఇండియన్ యూనియన్ మిస్లిం లీగ్ లీడర్, రాష్ట్ర విద్యాశాఖ మంద్రి వీ శివన్కుట్టి ఖండించారు. ఫుట్‌బాల్‌ను చూడటం, ప్రేమించడం అనేది.. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినది అని అన్నారు. ఇతరుల ఇష్టాలపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు.
"ఫుట్బాలను ప్రేమించడం, లెజండరీ ఆటగాళ్లను పూజించడం అనేది.. వ్యక్తిగత స్వచ్ఛకు సంబంధించిన విషయం. స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. మాచ్ చూడాలా? వద్దా? అనే వ్యక్తిగత ఇష్టాలు. మన రాజ్యంగం ఆ హక్కును ఇచ్చింది," అని తెలిపారు.
కేరళలో బ్రెజిల్, అర్జెంటీనా జట్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మెస్సీ, నెయ్‌మర్‌తో పాటు చాలా మంది ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఉన్నారు.
సంబంధిత కథనం