తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Haris Rauf Diet: నేను రోజుకు 24 గుడ్లు తింటాను: పాకిస్థాన్‌ పేసర్‌ షాకింగ్‌ డైట్

Haris Rauf Diet: నేను రోజుకు 24 గుడ్లు తింటాను: పాకిస్థాన్‌ పేసర్‌ షాకింగ్‌ డైట్

Hari Prasad S HT Telugu

09 January 2023, 20:44 IST

    • Haris Rauf Diet: నేను రోజుకు 24 గుడ్లు తింటాను అంటూ పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ తన షాకింగ్‌ డైట్‌ గురించి వెల్లడించాడు. పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్‌లో హస్నా మనా హై అనే ప్రోగ్రామ్‌లో భాగంగా రవూఫ్‌ ఈ విషయం చెప్పాడు.
పాకిస్థాన్ పేస్ బౌలర్ హారిస్ రవూఫ్
పాకిస్థాన్ పేస్ బౌలర్ హారిస్ రవూఫ్ (AP)

పాకిస్థాన్ పేస్ బౌలర్ హారిస్ రవూఫ్

Haris Rauf Diet: ప్రస్తుతం పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌లోని బెస్ట్‌ పేస్‌ బౌలర్లలో ఒకడు హారిస్‌ రవూఫ్‌. 29 ఏళ్ల ఈ క్రికెటర్‌ ఒకప్పుడు నెట్‌ బౌలర్‌. అలాంటిది ఇప్పుడు పాకిస్థాన్‌లో ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అన్ని ఫార్మాట్లలోనూ పాక్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న బౌలర్‌. 2020లో వన్డేల్లోకి వచ్చిన రవూఫ్‌ ఇప్పటి వరకూ 16 వన్డేల్లో 29 వికెట్లు తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఇక 52 టీ20ల్లో 72 వికెట్లు తీయడం విశేషం. అతడు ఈ మధ్య జియో న్యూస్‌ ఛానెల్‌ హస్నా మనా హై ప్రోగ్రామ్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను బరువు పెరగడానికి ఫాలో అయిన డైట్‌ ప్లాన్‌ గురించి వెల్లడించాడు. దీనికోసం తాను రోజుకు 24 గుడ్లు తింటానని చెప్పడంతో సదరు టీవీ ఛానెల్‌ యాంకర్‌ షాక్‌ తింది.

"నేను రోజుకి 24 గుడ్లు తింటాను. మాజీ క్రికెటర్‌, కోచ్‌ అఖిబ్‌ జావెద్‌ నాకు ఈ డైట్‌ ప్లాన్‌ ఇచ్చాడు. బ్రేక్‌ఫాస్ట్‌కు 8 గుడ్లు, లంచ్‌కు 8 గుడ్లు, డిన్నర్‌కు 8 గుడ్లు తింటాను. నేను తొలిసారి క్రికెట్‌ అకాడెమీకి వెళ్లినప్పుడు రూమ్‌ మొత్తం గుడ్లే ఉన్నాయి. అది చూసి నేను కోళ్ల ఫారానికి వచ్చానా అనిపించింది" అంటూ హారిస్‌ రవూఫ్‌ నవ్వుతూ చెప్పాడు.

"నేను 72 కిలోలు ఉండేవాడిని. కానీ నా ఎత్తుకు సరిపడా ఉండాలంటే 82-83 కేజీలు ఉండాలని అఖిబ్‌ చెప్పాడు. నేనిప్పుడు 82 కిలోలు ఉన్నాను" అని హారిస్‌ చెప్పాడు. అంతేకాదు టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి తనపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించాడు.

"రవిశాస్త్రిని కలుస్తూ ఉంటాను. అతన్ని కలిసినప్పుడల్లా ఓ నెట్‌బౌలర్‌గా ఉన్న నేను ఇప్పుడీ స్థాయికి చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. నేను ఎలా పేరు సంపాదించానో చెబుతూ మురిసిపోతుంటారు. నా సక్సెస్‌తో అతడు ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు" అని హారిస్‌ రవూఫ్‌ తెలిపాడు. అతడు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడుతున్న పాకిస్థాన్‌ టీమ్‌లో ఆడుతున్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం