తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gambhir On Arshdeep: అర్ష్‌దీప్ నోబాల్స్ వేయడం మానుకో.. నువ్వేమి ఉమ్రాన్, సిరాజ్ కాదు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

Gambhir on Arshdeep: అర్ష్‌దీప్ నోబాల్స్ వేయడం మానుకో.. నువ్వేమి ఉమ్రాన్, సిరాజ్ కాదు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

08 January 2024, 20:37 IST

google News
    • Gambhir on Arshdeep: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. పదే పదే అతడు నోబాల్స్ వేస్తుండటంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నోబాల్స్ అస్సలు అంగీకరించకూడదని తెలిపాడు. ఉమ్రాన్, సిరాజ్ మాదిరిగా అతడిలో వేగం లేదని స్పష్టం చేశాడు.
అర్ష్‌దీప్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్
అర్ష్‌దీప్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్ (PTI-AP)

అర్ష్‌దీప్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్

Gambhir on Arshdeep: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నోబాల్స్ అంశం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో అతడు నోబాల్స్ వేయడం ద్వారా భారత మూల్యం చెల్లించుకున్న దాఖాలాలు ఉన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ అతడు నోబాల్స్ వేశాడు. మొదటి టీ20లో అర్ష్‌దీప్ నోబాల్ వేయడం వల్ల డారిల్ మిచెల్ సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఆ ఓవర్‌లో 27 పరుగులు చేసింది న్యూజిలాండ్. దీంతో స్కోరు 20 ఓవర్లకు 176గా మారింది. దీంతో అతడిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో నోబాల్స్ వేయడాన్ని అస్సలు అంగకీరంచకూడదని స్పష్టం చేశాడు.

"స్కోరు గణాంకాలు చూస్తే బాగానే ఉన్నాయి. మ్యాచ్ ఎప్పుడూ ఎలాగైనా వెళ్లవచ్చు. కానీ నోబాల్స్ వేయడాన్ని మాత్రం అస్సలు భరించలేం. అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలో నోబాల్స్‌ను అస్సలు అంగీకరించకూడదు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల జట్టు తిరిగి పుంజుకోడానికే కాకుండా.. మిమ్మల్ని కూడా దీర్ఘకాలంలో బాధిస్తుంది." అని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జరిగిందని గంభీర్ తెలిపాడు. "కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నోబాల్సే తీరని నష్టం చేశాయి. ఇక్కడ కేవలం బేసిక్స్‌ను సరిచూసుకుంటే సరిపోతుంది. వరల్డ్ కప్ పరిస్థితులు సాధారణంగా స్వదేశంలో ఆడేదానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో స్వింగ్ ఉంటుంది, కొత్త బంతితో అయితే ఇంకా బౌన్స్ అవుతుంది. కానీ ఉపఖండపు పిచ్‌ల్లో ఆడుతున్నప్పుడు ఇక్కడ పిచ్‌లు ఫ్లాట్‌గా ఉంటాయి." అని గంభీర్ పేర్కొన్నాడు.

అర్ష్‌దీప్ ఈ విషయంలో మెరుగుపడాలని గంభీర్ సూచించాడు. "అతడు తన బౌలింగ్ వేరియేషన్స్ మార్చుకోవాలని స్పష్టం చేశాడు. నిదానంగా వేసే బౌన్సర్ లేదా నిదానంగా బంతిని సంధించాలనుకునే స్లీవ్స్ విషయంలో ఒకరకమైన వైవిధ్యం ఉంటుంది. దురదృష్టవశాత్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేంత వేగం అతడిలో లేదు. కాబట్టి కొంత వేరియషన్‌ను అతడు అభివృద్ధి చేసుకోవాలి. ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్‌లా అతడు కాదు. కాబట్టి అతడు చేయాల్సిందల్లా సింపుల్‌గా ప్రయత్నించడమే. నోబాల్స్‌ను వేయడం తగ్గించుకోవడం చాలా ముఖ్యం." అని గంభీర్ తెలిపాడు.

అర్ష్‌దీప్ కీలక మ్యాచ్‌ల్లో నో బాల్స్ వేయడం ఇదే కొత్తమి కాదు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయంలో అతడిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ పదే పదే ఇదే తప్పును పునరావృతం చేయడంతో నెటిజన్లతో సహా క్రికెట్ అభిమానులు, మాజీలు సైతం అతడిపై మండిపడుతున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం