తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Liger-mike Tyson: లైగర్‌లో నటించిన మైక్‌ టైసన్‌ గురించి ఈ ఇంట్రెస్టింగ్‌ విషయం తెలుసా?

Liger-Mike Tyson: లైగర్‌లో నటించిన మైక్‌ టైసన్‌ గురించి ఈ ఇంట్రెస్టింగ్‌ విషయం తెలుసా?

Hari Prasad S HT Telugu

21 July 2022, 12:20 IST

    • Liger-Mike Tyson: లైగర్‌ మూవీ ఇప్పుడు ఇండియన్‌ సినిమా ఫ్యాన్స్‌ అందరిలోనూ ఎంతో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ మూవీలో మైక్‌ టైసన్‌లాంటి లెజెండరీ బాక్సర్‌ నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
లైగర్ మూవీకి డబ్బింగ్ చెబుతున్న మైక్ టైసన్
లైగర్ మూవీకి డబ్బింగ్ చెబుతున్న మైక్ టైసన్ (Twitter)

లైగర్ మూవీకి డబ్బింగ్ చెబుతున్న మైక్ టైసన్

టాలీవుడ్‌ నుంచి వస్తున్న మరో పాన్‌ ఇండియా మూవీ లైగర్‌. విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ నుంచి ట్రైలర్‌ గురువారం (జులై 21) లాంచ్‌ అయింది. అంచనాలకు తగినట్లే ట్రైలర్‌ అదుర్స్‌ అనిపించేలా ఉంది. ఇందులో విజయ్‌, పూరి మార్క్‌ స్పష్టంగా కనిపించింది. ఇక ట్రైలర్‌ చివర్లో లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఎంట్రీ అదిరిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

వరల్డ్‌ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌గానే కాకుండా తన కెరీర్‌లో ఎన్నో వివాదాలతో ది బ్యాడెస్ట్‌ మ్యాన్ ఆన్‌ ద ప్లానెట్‌గా ఎప్పుడూ వార్తల్లో నిలిచేవాడు మైక్‌ టైసన్‌. అలాంటి వ్యక్తిని తొలిసారి ఇండియన్‌ స్క్రీన్‌పై నటింపజేయడం నిజంగా విశేషమే. అయితే మైక్‌ టైసన్‌ గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో అతడే తన గురించి చెప్పిన విషయం ఇది.

తన ప్రత్యర్థులపై పవర్‌ఫుల్‌ పంచ్‌లతోనే కాదు బూతులతోనూ విరుచుకుపడే అలవాటు టైసన్‌ది. అయితే ఈ నెగటివ్‌ ఆటిట్యూట్‌ పట్ల తాను సిగ్గుపడినా.. తన కెరీర్‌ ఈ స్థాయికి చేరడంలో అది కూడా ఓ కీలకపాత్ర పోషించిందని అతను చెప్పడం విశేషం. ప్రత్యర్థుల పట్ల ఈర్శ్య, అసూయలాంటివి లేకపోతే తననీ రోజు ఎవరూ గుర్తు పట్టేవారే కాదని ఈ ఇంటర్వ్యూలో టైసన్‌ చెప్పాడు.

తన కెరీర్‌లో తన కంటే బెటర్‌ బాక్సర్లను రింగ్‌లోనే కుప్పకూల్చాలన్న కసి తనలో ఉండేదని, దీనివల్లే తానీ స్థాయికి చేరినట్లు టైసన్‌ తెలిపాడు. లెజెండరీ బాక్సర్‌ మహ్మద్‌ అలీని ఆరాధించే టైసన్‌.. తాను ఛాంపియన్‌ అయిన తర్వాత మాత్రం అతని అడుగు జాడల్లో నడవనని, తాను ఓ క్రూరమైన, దుర్మార్గమైన బాక్సర్‌గా ఉండాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. అంతటి బాక్సర్‌ ఇప్పుడు లైగర్‌ మూవీతో మన ఇండియన్‌ స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. మరి టైసన్‌తో పూరి జగన్నాథ్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేశాడో చూడాలి.

తదుపరి వ్యాసం