Dinesh Karthik on KL Rahul : ఆస్ట్రేలియా సిరీస్‌పై దినేశ్ కార్తీక్ వార్నింగ్
25 December 2022, 19:48 IST
- WTC Finals : భారత్ టెస్టు సిరీస్ ఆస్ట్రేలియాతో జరగనుంది. WTC ఫైనల్‌లో కోసం కచ్చితంగా గెలవాలి. అయితే ఈ సందర్భంగా దినేశ్ కార్తీక్ పలు సందేహాలు వ్యక్తం చేశాడు.
కేఎల్ రాహుల్
ఆస్ట్రేలియా(Australia)తో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్‌గా KL రాహుల్ స్థానం భారత్‌కు సమస్యలను కలిగిస్తుందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. మూడో స్పిన్నర్ స్థానానికి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సమానంగా సరిపోయే అవకాశం ఉందని చెప్పాడు.
బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రాహుల్ భారత్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 2-0 తేడాతో గెలిచినప్పటికీ రాహుల్ బ్యాట్ నిరాశపరించింది. భారత్ తదుపరి టెస్ట్ సిరీస్.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో స్థానం కోసం పోటీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాలి. భారీ టెస్ట్ సిరీస్‌పై తన ఆలోచనల గురించి కార్తీక్ క్రిక్‌బజ్‌తో చెప్పాడు..
'మేము ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు రెండు పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌తో మీరు సంతోషంగా ఉండబోతున్నారా? మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లలో ఎవరిని ఎంచుకోబోతున్నారు? ఇవి సమాధానం చెప్పడానికి కఠినమైన ప్రశ్నలు, కానీ వాటికి సమాధానం ఇవ్వాలి.' అని దినేశ్ కార్తీక్(Dinesh Karthik) అన్నాడు.
బంగ్లాదేశ్‌లో రోహిత్ శర్మ గైర్హాజరీతో రాహుల్, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రాహుల్‌ను బాధపెట్టేది ఏమిటని అడిగినప్పుడు.. స్పష్టమైన మనస్సుతో ఆడుతున్నట్లు కనిపించడం లేదని కార్తీక్ వ్యాఖ్యానించాడు.
'ఆస్ట్రేలియాపై అతనికి అవకాశం ఇవ్వడంతో ఉత్తమమైన ఫలితాన్ని పొందాలి. కానీ అతను కచ్చితంగా స్వేచ్ఛగా ఉండాలి. అలా అయితేనే కొంత విజయం వస్తుంది. రాహుల్ వన్డేల్లో బాగా రాణిస్తే.. అది అతనిని మంచి స్థితిలో ఉంచుతుంది. అతను భారత జట్టు కెప్టెన్. సులభంగా వదులుకోలేరు. అతను ఖచ్చితంగా ఆస్ట్రేలియన్ సిరీస్‌ను ప్రారంభిస్తాడని నేను అనుకుంటున్నాను. అక్కడ సరిగ్గా జరగకపోతే చాలా పెద్ద ప్రశ్నలు తలెత్తుతాయి.' అని దినేశ్ అన్నాడు.