తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni Vintage Rolls Royce Car: రాంచీ రోడ్లపై వింటేజ్ రోల్స్ రాయిస్ కారు నడిపిన ధోనీ.. వీడియో వైరల్

Dhoni vintage rolls royce car: రాంచీ రోడ్లపై వింటేజ్ రోల్స్ రాయిస్ కారు నడిపిన ధోనీ.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

25 July 2023, 18:33 IST

google News
    • Dhoni vintage rolls royce car: రాంచీ రోడ్లపై వింటేజ్ రోల్స్ రాయిస్ కారు నడిపాడు మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధోనీ దగ్గర ఉన్న 1980నాటి రోల్స్ రాయిస్ కారు ఇలాంటిదే
ధోనీ దగ్గర ఉన్న 1980నాటి రోల్స్ రాయిస్ కారు ఇలాంటిదే

ధోనీ దగ్గర ఉన్న 1980నాటి రోల్స్ రాయిస్ కారు ఇలాంటిదే

Dhoni vintage rolls royce car: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తన సొంతూరు రాంచీలో ఉన్నప్పుడు తన ఇంట్లోని వింటేజ్ బైకులు, కార్లు తీసి రోడ్లపై చెక్కర్లు కొడుతుండటం చూసే ఉంటారు కదా. తాజాగా అతడు మరోసారి ఓ వింటేజ్ కారు దుమ్ము దులిపాడు. ఈ మధ్యే అతని ఇంట్లోని బైకులు, కార్ల కలెక్షన్ కు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయింది.

ఇక ఇప్పుడు ధోనీ 1980నాటి రోల్స్ రాయిస్ కారులో రాంచీ రోడ్లపై దూసుకెళ్లాడు. ఆ కారు వెనుక బైకుపై వెళ్తున్న ఓ అభిమాని ఆ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. 43 ఏళ్ల కిందటి ఈ కారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందులో ధోనీ తనదైన స్పీడుతో దూసుకెళ్లడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ధోనీ సోషల్ మీడియాను చాలా అరుదుగా ఉపయోగిస్తుంటాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం అతనికి సంబంధించిన ఏ ఫొటో లేదా వీడియో దొరికినా వెంటనే అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా ధోనీ ఇలా తన దగ్గర ఉన్న ఎన్నో లగ్జరీ, వింటేజ్ బైకులు, కార్లపై బయటకు వచ్చినప్పుడు ఫొటోలు, వీడియోలు తీయడానికి ఫ్యాన్స్ ఎగబడతారు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ధోనీ చాలా వరకూ తన సొంతూరు రాంచీలోనే ఉంటున్నాడు. దీంతో తరచూ అక్కడి రోడ్లపై ఇలా కనిపిస్తూనే ఉన్నాడు. ధోనీ దగ్గర ప్రస్తుతం 15 హైఎండ్ కార్లు, 70 బైకులు ఉన్నాయి. వాటిలో కవాసకి నింజా, డ్యుకాటి, హార్లీ డేవిడ్‌సన్ లాంటి ఖరీదైన బైకులు కూడా ఉన్నాయి. తాజాగా అతడు నడిపిన రోల్స్ రాయిస్ వింటేజ్ కారు కూడా ఆ కలెక్షన్ లో భాగమే.

ఈ రోల్స్ రాయిస్ డ్రైవ్ చేస్తున్న వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. వేల మంది లైక్స్, షేర్లు చేస్తున్నారు. ఈ మధ్యే మోకాలి సర్జరీ చేయించుకున్న ధోనీ ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ లో ఉన్నాడు. అప్పుడప్పుడూ ఇలా తనకెంతో ఇష్టమైన బైక్ రైడింగ్, కారు డ్రైవింగ్ చేస్తున్నాడు.

తదుపరి వ్యాసం