తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Prithvi Shaw Breakup : అయ్యో మళ్లీనా.. రెండో గర్ల్ ఫ్రెండ్​తోనూ పృథ్వీ షా బ్రేకప్!

Prithvi Shaw Breakup : అయ్యో మళ్లీనా.. రెండో గర్ల్ ఫ్రెండ్​తోనూ పృథ్వీ షా బ్రేకప్!

Anand Sai HT Telugu

30 January 2023, 19:01 IST

    • Prithvi Shaw Breakup : టీమిండియా యువ బ్యాట్స్ మెన్ పృథ్వీషా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాతో విడిపోయినట్లు ప్రచారం అవుతోంది.
పృథ్వీ షా బ్రేకప్
పృథ్వీ షా బ్రేకప్

పృథ్వీ షా బ్రేకప్

టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా(Prithvi Shaw) తన రెండో గర్ల్ ఫ్రెండ్ కూ గుడ్ బై చెప్పేశాడట. చాలా రోజులుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని ప్రచారం ఉంది. అయితే తాజాగా బ్రేకప్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిధి తపాడియా (Prithvi Shaw Gf Nidhi Tapadia) Instagramలో ఒక కథనాన్ని పంచుకుంది. ఇది ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని ప్రచారం జరిగేందుకు బలంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

నిధి తపాడియా(Nidhi Tapadia) ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను పంచుకుంది. ఇందులో పంజాబీ పాటను నేపథ్య పాటగా వాడుకుంది. అయితే ఇది బ్రేకప్ సాంగ్ అన్నమాట. మరోవైపు పృథ్వీ షా, నిధి తపాడియా ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. నిధి మోడల్, నటి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 108K ఫాలోవర్లు ఉన్నారు. ఆమె మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన వ్యక్తి.

పృథ్వీ షా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ (IND vs NZ T20) ఆడుతున్న జట్టులో ఉన్నాడు. పృథ్వీ, నిధి తపాడియా డేటింగ్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. కొంత కాలంగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ కూడా జరుపుకొన్నారు. పృథ్వీ షా రంజీలో 300 పరుగులు చేసిన సమయంలో కూడా నిధి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అతని వీడియోను షేర్ చేసింది.

అంతకుముందు పృథ్వీ షా.. బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రాచీ సింగ్‌ (Prachi Singh)తో కూడా సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరు కలిసి చాలా సార్లు.. పార్టీలకు వెళ్లారు. పృథ్వీ ప్రేమలో ఉన్నాడని.., వార్తలు వచ్చాయి. అయితే ప్రాచీకి పృథ్వీ బ్రేకప్ చేప్పినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా పృథ్వీ, ప్రాచీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వారు బ్రేకప్ చేసుకున్నారని అంతా అనుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం