తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pujara Vs Prithvi Shaw: కౌంటీ వ‌న్డేల్లో పుజారా సెంచ‌రీ - అయినా పృథ్వీ షా టీమ్‌దే గెలుపు!

Pujara vs Prithvi Shaw: కౌంటీ వ‌న్డేల్లో పుజారా సెంచ‌రీ - అయినా పృథ్వీ షా టీమ్‌దే గెలుపు!

HT Telugu Desk HT Telugu

07 August 2023, 13:33 IST

  • Pujara vs Prithvi Shaw: కౌంటీ వ‌న్డే క్రికెట్‌లో ఛ‌టేశ్వ‌ర్ పుజారా జ‌ట్టును పృథ్వీ షా టీమ్ ఓడించింది. పుజారా సెంచ‌రీతో మెరిసిన త‌న జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు.

ఛ‌టేశ్వ‌ర్ పుజారా
ఛ‌టేశ్వ‌ర్ పుజారా

ఛ‌టేశ్వ‌ర్ పుజారా

Pujara vs Prithvi Shaw: కౌంటీ క్రికెట్ టీమ్ ఇండియా క్రికెట‌ర్లు ఛ‌టేశ్వ‌ర్ పుజారా, పృథ్వీషా ప్ర‌త్య‌ర్థులుగా బ‌రిలో దిగారు. ఈ మ్యాచ్‌లో పుజారా టీమ్‌పై పృథ్వీ షా జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. రాయ‌ల్ లండ‌న్ వ‌న్డే క‌ప్‌లో భాగంగా ఆదివారం స‌సెక్స్‌, నార్తంప్ట‌న్‌షైర్ జట్ల మ‌ధ్య వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. వ‌ర్షం కార‌ణంగా 45 ఓవ‌ర్ల‌కు మ్యాచ్‌ను కుదించారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్‌లో స‌సెక్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్న పుజారా సెంచ‌రీతో చెల‌రేగాడు. 119 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 106 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డిన ఈ పిచ్‌పై నార్తంప్ట‌న్‌షైర్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొంటూ పుజారా సెంచ‌రీ సాధించాడు.

పుజారా శ‌త‌కంతో 45 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి స‌సెక్స్ టీమ్ 240 ర‌న్స్ చేసింది. 241 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలో దిగిన నార్తంప్ట‌న్‌షైర్ మ‌రో ఎనిమిది బాల్స్ మిగిలుండ‌గానే మూడు వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఓట‌మి దిశ‌గా ప్ర‌యాణిస్తోన్న నార్తంప్ట‌న్ షైర్‌ను టామ్ టేల‌ర్‌, జ‌స్టిన్ బ్రాడ్ క‌లిసి గెలిపించారు.

వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 80 ప‌రుగులు జోడించారు. టామ్ టేల‌ర్ 23 బాల్స్‌లోనే మూడు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో 42 ర‌న్స్ చేయ‌గా, జ‌స్టిన్ బ్రాడ్ 16 బాల్స్‌లో 22 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. కాగా నార్తంప్ట‌న్‌షైర్ టీమ్ ఓపెన‌ర్‌గా టీమ్ ఇండియా ప్లేయ‌ర్ పృథ్వీషా బ‌రిలో దిగాడు. 17 బాల్స్‌లో నాలుగు ఫోర్ల‌తో 25 ర‌న్స్ చేశాడు పృథ్వీ షా.

తదుపరి వ్యాసం