BCCI : భారత్‌లో 88 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు.. బీసీసీఐకి డబ్బులే డబ్బులు!
06 August 2023, 12:02 IST
- BCCI : వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 88 క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 2023 నుంచి 2028 వరకు భారత్‌లో జరిగే అన్ని మ్యాచ్‌ల ప్రసార హక్కులను వేలం వేయాలని పీసీసీ నిర్ణయించింది.
బీసీసీఐ
రాబోయే ఐదేళ్లలో ఇండియాలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కువ సంఖ్యలో జరగనున్నాయి. అయితే మ్యాచ్ ప్రసార హక్కుల ద్వారా భారీ మెుత్తం సంపాదించాలని బీసీసీఐ టార్గెట్ పెట్టుకుంది. IPL వేలం వలె, డిజిటల్, టీవీకి వేర్వేరు వేలం నిర్వహిస్తారు. ఐపీఎల్ నుంచి బీసీసీఐకి రూ.48,390 కోట్లు వచ్చాయి. అదేవిధంగా భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను విక్రయించడం ద్వారా మరో 8000 కోట్లు రాబట్టాలని బీసీసీఐ యోచిస్తోంది.
ఈ మొత్తం టెలివిజన్, డిజిటల్ రెండింటికీ చెల్లించబడింది. ఈ వేలంలో ప్రముఖ టీవీ కంపెనీలు, డిజిటల్ కంపెనీలు పాల్గొంటున్నాయి. వచ్చే ఐదేళ్లలో భారత జట్టు స్వదేశంలో మొత్తం 88 క్రికెట్ మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇందులో 25 టెస్టు మ్యాచ్‌లు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, పది టీ20లు ఆడనుంది.
అదేవిధంగా ఇంగ్లండ్‌తో భారత్ 10 టెస్టులు, 3 వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాక్ జట్టు వచ్చి భారత్‌లో పర్యటిస్తుందా అనే ప్రశ్నకు బీసీసీఐ నో చెప్పింది. ఇప్పటి వరకు పాకిస్థాన్ వచ్చి భారత్‌లో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్‌లో భారత్ పాకిస్థాన్‌ను చేర్చలేదని బీసీసీఐ ప్రకటించింది. దీంతో మరో ఐదేళ్లపాటు ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు.
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్-17 విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే(General Elections) ఇందుకు ప్రధాన కారణం. అంటే ఐపీఎల్ 2024(IPL 2024)లోగా భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. గతంలో 2009, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించింది. ఇప్పుడు దీన్ని బట్టి వచ్చే ఐపీఎల్ కూడా విదేశాల్లో జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఓ వైపు భారత్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా, మరోవైపు టీ20 ప్రపంచకప్(T20 World Cup)కు తేదీ కూడా ఫిక్స్ అయింది. దీని ప్రకారం జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీ ఖరారైతే, అంతకంటే ముందే ఐపీఎల్ నిర్వహించాల్సి ఉంటుంది.
మార్చి-మే మధ్య ఐపీఎల్‌ను పూర్తి చేయాల్సిన అవసరం బీసీసీఐ(BCCI)కి ఉంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ 2024 జూన్ నుంచి ప్రారంభం కానుంది. మార్చి లేదా మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీసీసీఐ కష్టాల్లో పడుతుంది. దీంతో విదేశాల్లో టోర్నీ నిర్వహించడంపై చర్చ సాగుతోంది.