తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket Legends Praise On Sanju Samson: టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఇది - సంజూ శాంస‌న్‌పై మాజీ క్రికెట‌ర్ల ప్ర‌శంస‌లు

cricket legends praise on sanju samson: టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఇది - సంజూ శాంస‌న్‌పై మాజీ క్రికెట‌ర్ల ప్ర‌శంస‌లు

07 October 2022, 8:53 IST

  • cricket legends praise on sanju samson: గురువారం సౌతాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో అస‌మాన ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు సంజూ శాంస‌న్‌. చివ‌రి వ‌ర‌కు టీమ్ ఇండియా గెలుపు కోసం పోరాడాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ 9 ప‌రుగుల‌తో ఓట‌మి పాలైనా త‌న బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమాన‌లు మ‌న‌సుల్ని గెల‌చుకున్నాడు సంజూ శాంస‌న్‌.

సంజూ శాంస‌న్‌
సంజూ శాంస‌న్‌ (Twitter)

సంజూ శాంస‌న్‌

cricket legends praise on sanju samson: గురువారం సౌతాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమ్ ఇండియా తొమ్మిది ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. 250 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన టీమ్ ఇండియా న‌ల‌భై ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. యాభై ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాను శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో క‌లిసి సంజూ శాంస‌న్ గ‌ట్టెక్కించాడు. భార‌త్‌కు విజ‌యాన్ని అందించేందుకు చివ‌రి వ‌ర‌కు పోరాడాడు శాంస‌న్‌. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి స‌రైన స‌హ‌కారం ల‌భించ‌క‌పోవ‌డంతో అత‌డి పోరాటం వృథాగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

63 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, తొమ్మిది ఫోర్ల‌తో 86 ర‌న్స్ చేసిన శాంస‌న్ నాటౌట్‌గా మిగిలాడు.వ‌న్డేల్లో అత‌డికి ఇదే అత్యుత్త‌మ స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓట‌మి పాలైన శాంస‌న్ త‌న క్లాస్ ఇన్నింగ్స్‌తో క్రికెట్ అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు.

శాంస‌న్ బ్యాటింగ్‌పై ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌ర‌చిపోలేని గొప్ప ఇన్నింగ్స్ ఇదంటూ చెబుతున్నారు. 86 ప‌రుగుల‌తో ఈ మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ గొప్ప‌గా పోరాడాడ‌ని ఇయాన్ బిష‌న్ అన్నాడు. వ‌న్డేల్లో బెస్ట్ స్కోరు చేయ‌డం త‌న‌పై త‌న‌కు ఆత్మ‌విశ్వాసాన్ని పెంపొందించ‌డ‌మే కాకుండా ధైర్యంగా ముంద‌డుగు వేయ‌డానికి స్ఫూర్తినిస్తుంద‌ని బిష‌ప్ అన్నాడు.

హై క్వాలిటీ ఇన్నింగ్స్‌తో సంజూ శాంస‌న్ ఆక‌ట్టుకున్నాడ‌ని, అదృష్టం క‌లిసి రాలేక‌పోయినా అత‌డి అస‌మాన బ్యాటింగ్ మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంద‌ని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.

టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌తో సంజూ మెరిశాడ‌ని, టీమ్ ఇండియాను గెలిపించ‌డం శాయ‌శ‌క్తులా కృషిచేశాడ‌ని హ‌ర్భ‌జ‌న్ పేర్కొన్నాడు. క్రికెట్ అభిమానులు కూడా సోష‌ల్ మీడియాలో సంజూ శాంస‌న్ బ్యాటింగ్ తీరుపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

తదుపరి వ్యాసం