తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bcci On 2023 World Cup: వన్డే వరల్ట్ కప్ కోసం బీసీసీఐ కసరత్తులు.. 20 మంది షార్ట్ లిస్ట్..!

BCCI on 2023 World Cup: వన్డే వరల్ట్ కప్ కోసం బీసీసీఐ కసరత్తులు.. 20 మంది షార్ట్ లిస్ట్..!

01 January 2023, 18:02 IST

    • BCCI on 2023 World Cup: ముంబయిలో జరిగిన బీసీసీఐ పర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ కోసం 20 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం.
బీసీసీఐ
బీసీసీఐ

బీసీసీఐ

BCCI on 2023 World Cup: ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న 2023 వరల్డ్ కప్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఇందుకోసం బీసీసీఐ పకడ్భందీగా కార్యచరణనను మొదలుపెట్టింది. స్వదేశంలో జరగనున్న ఈ ప్రపంచకప్‌లో టీమిండియా సత్తా చాటేందుకు గానూ 20 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా కొన్ని కీలక మార్పులను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అగ్రశ్రేణి ఆటగాళ్లను ఫామ్ లేమి, గాయం సమస్యలను నివారించడానికి.. వచ్చే ఐపీఎల్ ఎడిషన్‌ ఆడవద్దని చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీసీ ఈవెంట్లపైనే దృష్టి సారించాలని కోరుతోంది. ముంబయిలో జరిగిన బీసీసీఐ పర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఎన్‌సీఏ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ ఛీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ హాజరయ్యారు. బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

2022లో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ రెండింటిని గెలవలేకపోయిన టీమిండియా ప్రదర్శనను సమీక్షించేందుకు ఈ సమావేశం జరిగింది. సమావేశానికి ముందు ఇందులో చర్చించాల్సిన కీలక అంశాల గురించి బీసీసీఐ ప్రకటించింది. భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌నకు సంబంధించిన రోడ్ మ్యాప్‌తో పాటు ఆటగాళ్ల లభ్యత, పనిభార నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు బీసీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుం టీమిండియా ఎంపిక ప్రమాణాలనుకు సంబంధించి మూడు కీలక సిఫార్సులను కూడా చేసింది.

1. వర్ధమాన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి ఎక్కువ దేశీయ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది.

2. సెలక్షన్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు యో-యో టెస్టు, డెక్సా ప్రమాణాలు ఉంటాయి. అంతేకాకుండా సెంట్రల్ పూల్ ఆఫ్ ప్లేయర్లకు అనుకూలంగా రోడ్ మ్యాప్ అమలుచేస్తారు.

3. పురుషుల FTP, ఐసీసీ సీడబ్ల్యూసీ 2023 కోసం సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ ఆడాలనకుంటున్న ఆటగాళ్లను పర్యవేక్షించడానికి ఎన్‌సీఏ ఐపీఎల్ ఫ్రాంఛైజీతో కలిసి పనిచేస్తుంది.