తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India Kit Sponsor: టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్

Team India Kit Sponsor: టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్

22 May 2023, 12:39 IST

google News
    • Team India Kit Sponsor: టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ రానుంది. ఈ మేరకు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు.
టీమిండియా కిట్ స్పాన్సర్‌గా అంతర్జాతీయ స్పోర్ట్స్ బ్రాండ్
టీమిండియా కిట్ స్పాన్సర్‌గా అంతర్జాతీయ స్పోర్ట్స్ బ్రాండ్ (Getty Images)

టీమిండియా కిట్ స్పాన్సర్‌గా అంతర్జాతీయ స్పోర్ట్స్ బ్రాండ్

Team India Kit Sponsor: టీమిండియా క్రికెట్ కిట్ స్పాన్సర్ మారనున్నారు. ఇప్పటి వరకు కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమెటెడ్ సంస్థ భారత జట్టుకు కిట్‌ను స్పాన్సర్ చేస్తుండగా.. ఇకపై ఈ స్థానాన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ అడిడాస్ భర్తీ చేయనుంది. ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ గూడ్స్ సంస్థ అడిడాస్(Adidas) టీమిండియాకు కిట్స్ స్పాన్సర్ చేసేందుకు గాను బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కార్యదర్శి జై షా ఖరారు చేశారు. ట్విటర్ వేదికగా తెలియజేశారు.

“కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌తో బీసీసీఐ భాగస్వామ్యాన్ని ప్రకటిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మేము క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. ప్రపంచంలోనే పాపులర్ స్పోర్ట్స్ బ్రాండ్‌లలో ఒకటైన అడిడాస్‌తో భాగస్వామిగా ఉండటం మాకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అడిడాస్ మీకు సాదర స్వాగతం” అంటూ జై షా సోమవారం నాడు తన ట్విటర్‌లో తెలియజేశారు.

ప్రస్తుతం స్పాన్సర్ చేస్తున్న కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెడ్‌కు చెందిన కిల్లర్ జీన్స్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ మే 31తో ముగియనుంది. ఆ తర్వాత అడిడాస్‌ డీల్ ప్రారంభమవుతుంది. కిల్లర్ జీన్స్ కంటే ముందు ఎంపీఎల్ స్పోర్ట్స్ టీమిండియాకు కిట్ స్పాన్సర్ చేసింది. అయితే వారు కాంట్రాక్ట్ సమయం ముగియడాని కంటే ముందే మధ్యలోనే నిలుపుదల చేసుకోవడంతో ఈ డీల్ కిల్లర్ జీన్స్‌కు వెళ్లింది. మూడేళ్లపాటు ఎంపీఎల్ స్పోర్ట్స్ మ్యాచ్‌కు రూ.6.5 లక్షలు చెల్లించేలా.. మొత్తంగా 9 కోట్లు కట్టేలా ఒప్పందం కుదుర్చుకోగా.. మధ్యలోనే నిలిపివేసింది. వీరి కాంట్రాక్ట్ 2023 మే 31తో ముగుస్తుంది. మధ్యలోనే వదిలేసుకోవడంతో కిల్లర్ జీన్స్ ఆ స్థానంలో వచ్చి ఇప్పటి వరకు స్పాన్సర్ చేస్తోంది.

ప్రస్తుత ప్రధాన స్పాన్సర్ అయిన బైజూస్ కాంట్రాక్ట్ నవంబరు 2023 కల్లా ముగుస్తుంది. దీంతో బీసీసీఐ ఇప్పటి నుంచి మరో స్పాన్సర్ కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు 2023లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న తరుణంలో త్వరలో భారత ఆటగాళ్లను సరికొత్త కిట్‌తో ప్రేక్షకులు చూడనున్నారు.

తదుపరి వ్యాసం