తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ball Tampering: ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేసింది.. అంపైర్లకు కళ్లు కనిపించడం లేదా: పాకిస్థాన్ మాజీ ప్లేయర్

Ball Tampering: ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేసింది.. అంపైర్లకు కళ్లు కనిపించడం లేదా: పాకిస్థాన్ మాజీ ప్లేయర్

Hari Prasad S HT Telugu

09 June 2023, 14:01 IST

google News
    • Ball Tampering: ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేసింది.. అంపైర్లకు కళ్లు కనిపించడం లేదా అంటూ పాకిస్థాన్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశాడు.
బాల్ టాంపరింగ్ ద్వారానే పుజారా, కోహ్లిలను ఆస్ట్రేలియా ఔట్ చేసిందన్న బాసిత్ అలీ
బాల్ టాంపరింగ్ ద్వారానే పుజారా, కోహ్లిలను ఆస్ట్రేలియా ఔట్ చేసిందన్న బాసిత్ అలీ (Getty/Reuters)

బాల్ టాంపరింగ్ ద్వారానే పుజారా, కోహ్లిలను ఆస్ట్రేలియా ఔట్ చేసిందన్న బాసిత్ అలీ

Ball Tampering: ఇండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేసిందా? దీనికి ఆధారాలు కూడా ఉన్నాయా? పాకిస్థాన్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ మాత్రం కంగారూలు కచ్చితంగా బాల్ టాంపరింగ్ చేశారని అంటున్నాడు. అంపైర్లకు, కామెంటేటర్లకు కళ్లు కనిపించడం లేదా అంటూ కూడా సీరియస్ అయ్యాడు. ముఖ్యంగా కోహ్లి, పుజారాలను బాల్ టాంపరింగ్ చేయడం ద్వారానే ఔట్ చేశారని అతడు చెప్పడం గమనార్హం.

బాల్ టాంపరింగ్ ఆధారం ఇదిగో..

"ముందుగా ఈ మ్యాచ్ కామెంటరీ ఇస్తున్న వాళ్లకు, అంపైర్లకు చప్పట్లు. ఆస్ట్రేలియా స్పష్టంగా బాల్ ను ఏదో చేసింది. ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. ఏ బ్యాటర్ కూడా ఏం జరుగుతుందన్నది ఆలోచించలేదు. బ్యాటర్లు బాల్ ను వదిలేస్తూ బౌల్డ్ అయ్యారు.

నా దగ్గర ఆధారం కూడా ఉంది. 54వ ఓవర్ వరకూ షమి బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి బయట మెరుపు ఉంది. కానీ బంతి స్మిత్ కు లోపలి వైపు స్వింగ్ అయింది. ఇది రివర్స్ స్వింగ్ కాదు. బంతి షైన్ లోపలి వైపు ఉండి ఆ బాల్ లోనికి దూసుకొస్తే దానిని రివర్స్ స్వింగ్ అంటారు" అని బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పాడు.

ఇండియా ఇన్నింగ్స్ లో 16 నుంచి 18వ ఓవర్ వరకూ కచ్చితంగా బాల్ టాంపరింగ్ జరిగిందని బాసిత్ చెప్పడం గమనార్హం. ఆ ఓవర్లలోనే కోహ్లి, పుజారా ఔటయ్యారు. "16, 17, 18 ఓవర్లు చూడండి. విరాట్ కోహ్లి ఔటైనప్పుడు బంతికి మెరుపు ఏవైపు ఉంది.

మిచెల్ స్టార్క్ బంతిని పట్టుకున్నపుడు మెరుపు బయటి వైపు ఉంది. కానీ ఆ బాల్ మాత్రం లోపలి వైపు వచ్చింది. జడేజా బాల్ ను ఆన్ సైడ్ ఆడుతుంటే అది పాయింట్ వైపు వెళ్తోంది. అంపైర్లకు కళ్లు కనిపించడం లేదా? అక్కడ కూర్చున్న వాళ్లు ఈ చిన్న విషయాన్ని గుర్తించలేకపోయారా" అని బాసిత్ అలీ అన్నాడు.

గ్రీన్ బౌలింగ్ లో పుజారా బంతిని వదిలేయగా.. అది కాస్తా అతని ఆఫ్ స్టంప్ కు తగిలింది. దీంతో అతడు షాక్ తిన్నాడు. "గ్రీన్ బంతి మెరుపు వైపు పుజారా వైపు వేశాడు. అది లోపలికి దూసుకొచ్చింది. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. బీసీసీఐ అంత పెద్ద బోర్డు. వాళ్లు కూడా చూడలేదా?

దానిని బట్టి క్రికెట్ పై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. ఇండియా ఫైనల్ చేరింది చాలనుకుంటున్నారు. అసలు బాల్ 15 నుంచి 20 ఓవర్ల మధ్య రివర్స్ స్వింగ్ అవుతుందా? అది కూడా డ్యూక్స్ బాల్? కూకాబుర్రా బాల్ అయితే అవుతుంది కానీ.. డ్యూక్స్ బాల్ కు కనీసం 40 ఓవర్లు కావాలి" అని బాసిత్ అలీ అన్నాడు.

తదుపరి వ్యాసం