Warner About Ball Tampering: బాల్ ట్యాంపరింగ్‌పై వార్నర్ బోల్డ్ స్టేట్మెంట్.. పశ్చాత్తాపమే లేదని స్పష్టం-david warner says he don t regret anything on 2018 ball tampering scandal ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  David Warner Says He Don't Regret Anything On 2018 Ball Tampering Scandal

Warner About Ball Tampering: బాల్ ట్యాంపరింగ్‌పై వార్నర్ బోల్డ్ స్టేట్మెంట్.. పశ్చాత్తాపమే లేదని స్పష్టం

Maragani Govardhan HT Telugu
Dec 21, 2022 12:04 PM IST

Warner About Ball Tampering: 2018లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బ్యాంక్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు వీరిపై వచ్చాయి. ఫలితంగా వార్నర్, స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. తాజాగా అంశంపై స్పందించిన వార్నర్.. తాను దేనికి బాధపడట్లేదని తెలిపాడు.

డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ (AP)

Warner About Ball Tampering: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ కెరీర్‌లో అత్యుత్తమ దశలోనే ఉన్నాడు. పలు ప్రపంచ టైటిళ్లు గెలిచిన ఆసీస్ జట్టులో వార్నర్ సభ్యుడు. మూడు ఫార్మాట్లలో రెగ్యూలర్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ డ్యాషింగ్ ఓపెనర్.. నిలకడగా రాణించాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం మినహా.. అతడి కెరీర్‌లో పెద్దగా లోటుపాట్లేమి లేవనే చెప్పాలి. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో 2018లో అతడిపై ఏడాది నిషేదం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. దక్షిణాఫ్రికాతోజరిగిన టెస్టు సిరీస్‌లో సాండ్ పేపర్‌తో బాల్ ట్యాంపరింగ్ చేసిన అపఖ్యాతీ పాలైన ముగ్గురు ఆటగాళ్లలో వార్నర్ కూడా ఒకడు. తాజాగా ఈ ఆసీస్ ఓపెనర్ ఆ ఘటనపై స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

బాల్ ట్యాంపరింగ్‌ ఘటనలో పశ్చాత్తాపపడుతున్నారా? అని ఓ ఇంటర్వ్యూలో వార్నర్‌ను అడుగ్గా.. అతడు లేదని సమాధానమిచ్చాడు. "నేను ఏ విషయంలోనూ పశ్చాత్తాపం చెందట్లేదు. ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చిన మార్గంలో వారు వెళ్లారు. అవునా కాదా? ఇక్కడ ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. మీరు పర్ఫెక్టుగా ఉండకుండా ఎదుటివారిని జడ్జ్ చేయకూడదు. మీరు ప్రతి ఒక్కరినీ మెప్పించలేరు. అలా అనుకుంటే రోబోనే అవుతారు. నా గతంలో ఏం జరిగినా అది నన్ను నేను వ్యక్తిగా మార్చుకునేలా చేసింది. బహుశా నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేలా చేసిందని అనుకుంటున్నాను." అని వార్నర్ స్పష్టం చేశాడు.

ప్రస్తుతం తన కెరీర్‌లో తాను చాలా ఆనందంగా ఉన్నానని వార్నర్ తెలిపాడు. "నా పరిధి చాలా చిన్నది. నన్ను ఎవరైతే నమ్ముతారో వారినే సలహాను మాత్రమే తీసుకుంటాను. ఒకవేళ నేను వెనక్కి వెళ్లి జరిగిన విషయాలను మార్చాలనుకున్నా.. అది నేను కాదు, నాకంత విలువ ఉండదు. కాబట్టి ఈ విషయంలో నేను అస్సలు పశ్చాత్తాపం చెందట్లేదు. ప్రస్తుతం ఏ దశలోనైతే ఉన్నానో దాన్ని ఆస్వాదిస్తున్నాను." అని వార్నర్ స్పష్టం చేశాడు.

2018లో నిషేధం సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి తనకు ఎలాంటి మద్దతు అందలేదని వార్నర్ పేర్కొన్నాడు. ఆటకు దూరంగా ఉన్న సమయంలో తనను తాను బట్టలను ఉతికి రీసైకిల్ చేసే వాషింగ్ మెషిన్‌తో పోల్చుకున్నాడు. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయని, జార్జ్ బెయిలీ, ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అద్భుతంగా పనిచేశారని స్పష్టం చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం