Babar Azam T20 Century: టీ20ల్లో న్యూజిలాండ్‌పై బాబర్ ఆజాం సెంచరీ - రోహిత్ రికార్డ్ బ్రేక్
16 April 2023, 12:25 IST
Babar Azam T20 Century: శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజాం పలు టీ20 రికార్డులను తిరగరాశాడు. ఆ రికార్డులు ఏవంటే...
బాబర్ ఆజాం
Babar Azam T20 Century: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో పలు రికార్డులను తిరగరాశాడు. లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 58 బాల్స్‌లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 101 రన్స్ చేశాడు బాబర్ ఆజాం. టీ20 ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.
ఈ లిస్ట్‌లో నాలుగు సెంచరీలతో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోండగా, మూడు సెంచరీలతో సూర్యకుమార్ యాదవ్( ఇండియా), కొలిన్ మున్రో (న్యూజిలాండ్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)లతో కలిసి బాబర్ ఆజాం సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. కెప్టెన్‌గా టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బాబర్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. అతడి తర్వాత రోహిత్ శర్మ రెండు సెంచరీలతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
గేల్ తర్వాత బాబర్
టీ20 ఫార్మెట్‌లో వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా బాబర్ ఆజాం రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ20 ఫార్మెట్‌లో క్రిస్ గేల్ ఇప్పటివరకు 22 సెంచరీలు చేయగా బాబర్ ఆజాం 9 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వార్నర్, ఫించ్, క్లింగర్ ఎనిమిది సెంచరీలతో థర్డ్ ప్లేస్‌లో కొనసాగుతోన్నారు.
కెప్టెన్‌గా రికార్డ్...
టీ20ల్లో కెప్టెన్‌గా బాబర్ ఆజాం ఇది 42వ విజయం కావడం గమనార్హం. టీ20ల్లో అత్యధిక విజయాల్ని అందుకున్న కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్, అస్ఘర్ సరసన బాబర్ ఆజాం చేరాడు.
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బాబర్ ఆజాం (101 రన్స్)తో పాటు రిజ్వాన్ ( 34 బాల్స్‌లో 50 రన్స్) చెలరేగడంతో ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయ 192 రన్స్ చేసింది. లక్షఛేదనలో బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో న్యూజిలాండ్ ఇరవై ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసింది. 38 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో చాప్‌మన్ 40 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 65 రన్స్ తో ఒంటరి పోరాటం చేశాడు.