Babar Azam on Ipl: ఐపీఎల్ కంటే బిగ్‌బాష్ బెస్ట్ - బాబ‌ర్ ఆజాం కామెంట్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్‌-babar azam prefers big bash better than ipl cricket fans troll his comments ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Babar Azam Prefers Big Bash Better Than Ipl Cricket Fans Troll His Comments

Babar Azam on Ipl: ఐపీఎల్ కంటే బిగ్‌బాష్ బెస్ట్ - బాబ‌ర్ ఆజాం కామెంట్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 17, 2023 08:24 AM IST

Babar Azam on Ipl: ఐపీఎల్ కంటే బిగ్‌బాష్ లీగ్ బెట‌ర్ అంటూ పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం చేసిన కామెంట్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు.

బాబ‌ర్ ఆజాం
బాబ‌ర్ ఆజాం

Babar Azam on Ipl: ఐపీఎల్ ప‌ట్ల పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌లో ఉన్న అసూయ, ద్వేషం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇండియ‌న్ లీగ్‌పై పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం (Babar Azam) చేసిన కామెంట్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. మోస్ట్‌ స‌క్సెస్‌ఫుల్ క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్ ఒక‌టి. వ‌ర‌ల్డ్‌లోనే రిచెస్ట్ లీగ్‌ల‌లో ఒక‌టిగా ఐపీఎల్ పేరుతెచ్చుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్‌కు పోటీగా ప‌లు దేశాలు క్రికెట్ లీగ్‌ల‌ను మొద‌లుపెట్టాయి. కానీ మ‌న లీగ్‌ స్థాయిలో ఆద‌ర‌ణ‌ను మాత్రం సొంతం చేసుకోలేక‌పోయాయి. అందులో పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌కు కూడా ఒక‌టి. ఐపీఎల్ కాపీ కొట్టి పీఎస్ఎల్‌ను మొద‌లుపెట్ట‌గా దారుణంగా విఫ‌ల‌మైంది. ఐపీఎల్ స‌క్సెస్‌పై పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌లో చాలా అసూయ ఉంది. అవ‌కాశం దొరికిన‌ప్పుడులా ఐపీఎల్‌పై త‌మ‌కున్న అక్క‌సును వెల్ల‌గ‌క్కుతూనే ఉన్నారు.

తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ఐపీఎల్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో పెషావ‌ర్ జాల్మీ టీమ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు బాబ‌ర్‌. ఈ లీగ్‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బిగ్‌బాష్‌లీగ్‌, ఐపీఎల్ ల‌లో మీకు న‌చ్చిన‌ది ఏది అని అడిగిన ప్ర‌శ్న‌కు బిగ్‌బాష్ లీగ్ అంటూ స‌మాధానం ఇచ్చాడు బాబ‌ర్‌.

బిగ్‌బాష్ లీగ్ పిచ్ కండీష‌న్స్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయి. అదే ఆసియా పిచ్ కండీష‌న్స్ అన్ని ఒకేలా అనిపిస్తాయి. పెద్ద‌గా తేడాలు క‌నిపించ‌వు. అందుకే ఐపీఎల్ కంటే బిగ్‌బాష్ లీగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటూ బాబ‌ర్ పేర్కొన్నాడు.

అత‌డి స‌మాధానంపై ఇండియ‌న్ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. ఐపీఎల్ స‌క్సెస్‌ను ఓర్వ‌లేక బాబ‌ర్ ఇలా కామెంట్ చేశాడ‌ని పేర్కొంటున్నారు. ఐపీఎల్ వ‌స్తోన్న ఆద‌ర‌ణ పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌కు కంట‌గింపుగా మారింద‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు.

WhatsApp channel