Kohli Fans Fire On Miller: కోహ్లి కంటే బాబర్ ఆజాం బెస్ట్ - సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఫైర్
Kohli Fans Fire On Miller: కోహ్లి కంటే బాబర్ ఆజాం బెస్ట్ అంటూ సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ చేసిన కామెంట్స్‌పై టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు.
Kohli Fans Fire On Miller: సమకాలీన ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో టీమ్ ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లితో పాటు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం దిగ్గజ ప్లేయర్స్‌గా కొనసాగుతోన్నారు. వీరిద్దరి ఆటతీరు, రికార్డుల విషయంలో చాలా కాలంగా పోలికలు నెలకొన్న సంగతి తెలిసిందే. కోహ్లికి ఏ మాత్రం తీసిపోని ఆటగాడు బాబర్ ఆజాం అంటూ కొందరు మాజీ క్రికెటర్లు చెబుతోండగా మరికొందరు మాత్రం కోహ్లితో అతడిని పోలికే లేదంటూ అభిప్రాయపడుతోన్నారు.
తాజాగా కోహ్లి, బాబర్ లలో ఎవరు గొప్ప అనే విషయంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ చేసిన కామెంట్స్ టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న డేవిడ్ మిల్లర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కవర్ డ్రైవ్ ఆడే విషయంలో కోహ్లి, బాబర్ లలో ఎవరు బెస్ట్ అంటూ అడిగిన ప్రశ్నకు బాబర్ అంటూ సమాధానం చెప్పాడు.
మిల్లర్ సమాధానంతో బాబర్ ఫ్యాన్స్ ఖుషి అయినా కోహ్లి అభిమానులు మాత్రం అతడిని గట్టిగానే ట్రోల్ చేస్తోన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ లీగ్‌లో ఆడుతున్న మిల్లర్ అక్కడి ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి కావాలనే కోహ్లిని తక్కువ చేశాడంటూ చెబుతున్నారు.
కోహ్లికి బాబర్ ఎప్పటికీ పోటీ కాదని అంటున్నారు. ఆ వాస్తవాన్ని మిల్లర్ తెలుసుకుంటే మంచిదంటూ విమర్శిస్తున్నారు. ఇదే ఇంటర్వ్యూలో యార్కర్స్ విషయంలో షాహిన్ అఫ్రిదీ, బుమ్రాలలో ఎవరు బెస్ట్ అని అడిగిన ప్రశ్నకు బుమ్రా అంటూ సమాధానం చెప్పాడు మిల్లర్.