Richest Zodiac Sign: ప్రపంచంలోని కుబేరుల్లో అధిక మంది ఈ రాశి వారే..! వాళ్లెవరో తెలుసుకుందాం
17 November 2024, 16:08 IST
- Richest Zodiac Sign: యూకేలోని లెండర్ క్యాష్‌ఫ్లోట్ జరిపిన స్టడీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులంతా ఈ రాశి వారేనని తెలిసింది. 300 బిలీయనర్లపై జరిపిన స్టడీ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రపంచంలోని కుబేరుల్లో అధిక మంది ఈ రాశి వారే..!
మనలో చాలా మందికి రాశి చక్రంపై అంతగా నమ్మకం లేకపోవచ్చు. కానీ, వాటిని సంబంధం లేదన్నట్లుగా కొట్టిపారేయడం కూడా కష్టమే. జ్యోతిష్యం, రాశి ఫలితం, హస్త సాముద్రికం వంటి వాటిని సైన్స్ చాలా కాలం నుంచి ఛాలెంజ్ చేస్తూ ఓడిపోతూనే ఉంది. అందులో వాస్తవం ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలువృత్తి, వివాహ సమస్యలకు జ్యోతిష్యాన్నే నమ్ముతుంటారు. ప్రతి రోజూ లక్షలాది మంది ఈ శాస్త్రాన్ని విశ్వసించి కెరీర్‌లో ముందుడుగేస్తున్నారు.ఈ శాస్త్రం ఆధారంగా కొన్ని వందల మంది బిలీయనర్లపై జరిపిన స్టడీలో కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవం బయటపడింది.
యూకే లెండర్ క్యాష్‌ఫ్లోట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది బిలీయనర్లంతా ఒకే రాశి కలిగి ఉండటం ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఫోర్బ్స్ బిలియనీర్ 2022 సంపన్నుల జాబితాలో టాప్ 300 బిలీయనీర్ల పుట్టిన తేదీ సమాచారాన్ని ఉపయోగించి జన్మ రాశుల గురించి తెలుసుకున్నారు. ఈ రీసెర్చ్‌లో తుల రాశి వారే ఎక్కువ ధనవంతులుగా ఉన్నట్లు తేలింది. రాశి జాబితాను బట్టి ఏడో రాశి అయిన తుల రాశి 22 సెప్టెంబర్ - 23 అక్టోబర్ మధ్య జన్మించిన వారికి ఉంటుంది. ప్రపంచ కుబేరుల్లో 32 మంది ఇదే రాశి వారని సర్వే ఫలితాలు వెల్లడించాయి.
రాశుల వారీగా ఫోర్బ్స్ జాబితాలోని ధనవంతుల శాతం ఇలా ఉంది.
తులా (Libra) – 12%
మీన (Pisces) – 11%
వృషభ (Taurus) – 10%
సింహ (Leo) – 9%
మేష (Aries) – 8%
కన్యా (Virgo) – 8%
మితున (Gemini) – 8%
కుంభ (Aquarius) – 7.5%
కర్కాటక (Cancer) – 7.5%
ధనుస్సు (Sagittarius) – 7.5%
వృశ్చిక (Scorpio) – 6%
మకర (Capricorn) – 5.5%
ఈ లిస్టులో మకర రాశి వారు చాలా తక్కువగా అంటే కేవలం 15 మందే ఉన్నారు. అదే సమయంలో తుల రాశి తర్వాత టాప్ 2 పొజిషన్ లో మీనరాశి వారు ఉన్నారు.
టాప్ 10 ధనవంతులు, వారి రాశులు
- బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ (నికర ఆస్తి: $214.9 బిలియన్) – రాశి: మీన (Pisces)
- ఎలాన్ మస్క్ (నికర ఆస్తి: $198.2 బిలియన్) – రాశి: కర్కాటక (Cancer)
- జెఫ్ బిజోస్ (నికర ఆస్తి: $120.4 బిలియన్) – రాశి: మకర (Capricorn)
- లారీ ఎలిసన్ (నికర ఆస్తి: $112.3 బిలియన్) – రాశి: సింహ (Leo)
- వారెన్ బఫెట్ (నికర ఆస్తి: $107.3 బిలియన్) – రాశి: కన్యా (Virgo)
- బిల్ గేట్స్ (నికర ఆస్తి: $107.0 బిలియన్) – రాశి: వృశ్చిక (Scorpio)
- కార్లోస్ స్లిమ్ హెలూ & ఫ్యామిలీ (నికర ఆస్తి: $90.7 బిలియన్) – రాశి: కుంభ (Aquarius)
- ముఖేష్ అంబానీ (నికర ఆస్తి: $86.0 బిలియన్) – రాశి: మేష (Aries)
- స్టీవ్ బాల్మెర్ (నికర ఆస్తి: $83.1 బిలియన్) – రాశి: మేష (Aries)
- లార్రీ పేజి (నికర ఆస్తి: $82.0 బిలియన్) – రాశి: మేష (Aries)
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్