Salt for Vastu Dosha: గుప్పెడు రాతి ఉప్పుతో ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దోషాల్ని పోగొట్టుకోవచ్చు, సంపన్నులు కావచ్చు
Salt for Vastu Dosha: హిందూ పురాణాలలో రాతి ఉప్పుకు చాలా పవిత్రమైన స్థానం ఉంది. ఉప్పుతో ఎన్నో దోషాలను పోగొట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న చెడుని పోగొట్టే శక్తి రాతి ఉప్పుకి ఉంది.
Salt for Vastu Dosha: వాస్తు శాస్త్రంలో రాతి ఉప్పుకు ప్రాధాన్యత ఎక్కువ. ఇది కాస్మిక్ ఎనర్జీని అందిస్తుందని చెబుతారు. అంటే పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో పెంచుతుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని పారదోలే ప్రక్రియలో రాతి ఉప్పుది ప్రథమ స్థానం. ఇంట్లోని ప్రతికూలతలను దూరం చేసి సానుకూలతను ప్రేరేపించడంలో రాతి ఉప్పు ఎంతో సహాయపడుతుంది.
రాతి ఉప్పుతో పరిహారాలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకు అద్భుతమైన శక్తి ఉంది. ఎందరో వాస్తు శాస్త్ర నిపుణులు ఇంట్లోని పాజిటివిటీని పెంచడం కోసం ఉప్పుతో ఎన్నో రెమెడీస్ ని చెబుతూ ఉంటారు. ఇది ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని అంటారు. ఇంట్లో డబ్బు పెరగడానికి సకల సౌభాగ్యాలు కలగడానికి రాతి ఉప్పుతో కొన్ని రకాల పనులు చేయాలి. ఈ పరిహారాల ద్వారా ఇల్లు సంపన్నమయం అవుతుంది. ఇంట్లో ఉన్నవారికి కూడా శ్రేయస్సు లభిస్తుంది. రాతి ఉప్పును ఉపయోగించి మీ ఇంటి సౌభాగ్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.
వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు సముద్రపు ఉప్పును వినియోగిస్తారు. సముద్రపు ఉప్పుకు ఎంతో శక్తి ఉందని నమ్ముతారు. సముద్రపు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని నిర్మూలిస్తుంది. సముద్రపు ఉప్పు అంటే ఏదో కాదు రాతి ఉప్పే.
మీ ఇంట్లో సుఖాలు సౌభాగ్యాలు విరాజిల్లాలంటే నేలను శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో రాతి ఉప్పును కలపండి. అది మొత్తం కరిగిపోయాక ఆ నీళ్లతో ఇంటిని శుభ్రం చేయండి. వాస్తు దోషాన్ని తొలగించడానికి ఇంట్లో అక్కడక్కడ ఉప్పును వేయడం కూడా మంచిదే.
కొంతమంది డిప్రెషన్, మానసిక ఆందోళన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు పిడికెలితో రాతి ఉప్పుని తీసుకొని దాన్ని చేత్తో మూసివేసి పట్టుకోవాలి. ఆ తర్వాత వాష్ బేసిన్లో వేయాలి. అలా వేస్తున్నప్పుడు ఉప్పు అంతా వాష్ బేసిన్ లోపలే పడాలి. వాష్ బేసిన్ నుండి కిందకు నేలపై పడకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ నుండి ప్రతికూల శక్తిని ఉప్పు గ్రహించి బయటకు పోయేలా చేస్తుంది.
ఉప్పుతో మీ ఇంట్లోని కొన్ని వస్తువులను శుభ్రపరచడం వల్ల ఇంట్లో సౌభాగ్యం, శ్రేయస్సు విరాజిల్లుతుంది. అలాగే దిష్టి పోవడం కోసం చేతుల్లో రాతి ఉప్పుని తీసుకొని ఒక వ్యక్తి తల చుట్టూ మూడుసార్లు తిప్పాలి. దాన్ని వాష్ బేసిన్లో వేసి చేతులు కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దిష్టి కూడా పోతుంది.
ఒక గిన్నెలో సముద్రపు ఉప్పును ఉంచి బాత్రూంలో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. వారం రోజులకు ఒకసారి ఆ గిన్నెను, ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది.
మీ బాత్రూం ఇంటికి ఈశాన్యం మూలలో ఉన్నట్లు అయితే అక్కడ అద్దం ఉంచడం వల్ల ప్రతికూలతలు తొలగిపోయే అవకాశం ఉంది. బాత్రూంలో బ్లూ కలర్ బకెట్, మగ్గు వాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాస్తు దోష ప్రభావాలు తగ్గుతాయి. బాత్రూం తలుపులు ఎప్పుడూ మూసి ఉండేలా చూసుకోండి. తలుపుల ముందు అద్దాన్ని వేలాడదీయడం వంటివి చేయకండి. అలాగే ఇంట్లో పగిలిన అద్దాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు వంటివి ఉంచకండి. వాటిని బాగు చేయండి లేదా బయటపడేయండి.
ఇంట్లో యుద్ధ వాతావరణంలో ఉన్న చిత్రాలు, ఏడుస్తున్న పిల్లల బొమ్మలు, బాధపడుతున్న వ్యక్తుల చిత్రాలు, పెయింటింగులు, తుఫాను వంటి పెయింటింగులు లేకుండా చూసుకోండి. కాక్టస్ చెట్లు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఇంట్లో కాక్టస్ మొక్కలు పెట్టకూడదు. ఇంటికి బయట కాక్టస్ పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.
టాపిక్