Navaratrulu: నవరాత్రులలో బార్లీ ఎందుకు నాటుతారు? దీని వెనుక కారణం ఏంటి?
30 September 2024, 16:04 IST
- Navaratrulu: నవరాత్రులలో కలశ స్థాపన సమయంలో జొన్న లేదా బార్లీ విత్తుకోవాలనే నియమం ఉంది. బార్లీని విత్తడం వల్ల జీవితంలో ఆనందం, సంపద, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. నవరాత్రులలో కలశ స్థాపనతో పాటు బార్లీ లేదా జొన్న ఎందుకు వేస్తారో తెలుసుకోండి. వాటిని ఎలా నాటాలో తెలుసుకోండి.
నవరాత్రుల్లో బార్లీ ఎందుకు పండిస్తారు?
Navaratrulu: హిందూ మతంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రుల తొమ్మిది రోజులలో దుర్గాదేవి వివిధ రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో మొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేసి జొన్న లేదా బార్లీని విత్తడం ఆచారం. ఘటస్థాపనతో పాటు బార్లీ విత్తడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. నవరాత్రి సమయంలో బార్లీని ఎందుకు పండిస్తారు? బార్లీని నాటే విధానం తెలుసుకోండి.
నవరాత్రి సమయంలో బార్లీని ఎందుకు పండిస్తారు?
మత విశ్వాసాల ప్రకారం సృష్టి ప్రారంభమైన తర్వాత బార్లీ మొదటి పంట. అందువల్ల దేవతలను పూజించినప్పుడల్లా బార్లీని హవనంలో సమర్పించడం ఆచారంగా వస్తోంది. దీనికి ప్రధాన కారణం బార్లీని బ్రహ్మగా భావించి ధాన్యాన్ని గౌరవించాలి. బార్లీ ఎంత వేగంగా ఎదుగుతుందనే దాని వెనుక అనేక శుభ్ సంకేతాలు దాగి ఉన్నాయి.
బార్లీ భవిష్యత్ ను సూచిస్తుంది
బార్లీ వేగవంతమైన పెరుగుదల ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. బార్లీ దట్టంగా పెరగకపోతే లేదా సరిగా పెరగకపోయిన అది ఇంటికి అశుభంగా భావిస్తారు. బార్లీ నలుపు రంగులో వంకరగా పెరిగినా అది కూడా అశుభమే. బార్లీ రంగు దిగువ నుంచి సగం పసుపు, పై నుంచి సగం ఆకుపచ్చ రంగులో ఉంటే రాబోయే సంవత్సరంలో సగం సమయం బాగుంటుందని నమ్ముతారు. అదే బార్లీ దిగువ నుండి సగం ఆకుపచ్చ, పై సగం పసుపు రంగులో ఉంటే సంవత్సరం ప్రారంభం బాగున్నటుందని. కానీ తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సంకేతం. మరోవైపు మీరు విత్తిన బార్లీ తెలుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారితే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
బార్లీ ఎలా నాటాలి?
పూజా స్థలంలో దుర్గా విగ్రహం ముందు మట్టి కుండలో వాటిని విత్తుతారు. ఈ విత్తనాలు తొమ్మిది రోజుల్లో మొక్కగా వచ్చి ఆకుపచ్చగా మారుతాయి. ఇది ఆనందం, శ్రేయస్సును సూచిస్తుంది. హిందూ మతం యొక్క నమ్మకాల ప్రకారం దేవతామూర్తుల పూజలో బార్లీని విత్తడం శుభప్రదంగా భావిస్తారు.
జొన్న లేదా బార్లీ విత్తే విధానం
1. నవరాత్రి మొదటి రోజున కలశాన్ని స్థాపించేటప్పుడు, మట్టి కప్పు లేదా పాత్రను తీసుకోండి. శుభ్రమైన నీటితో పూర్తిగా శుభ్రం చేయండి.
2. ఒక మట్టి కుండలో రోలితో స్వస్తిక్ తయారు చేసి అందులో మట్టి, పొడి ఆవు పేడ ఎరువు వేయండి.
3. మట్టిని తేమ చేయడానికి నీటిని పిచికారీ చేయండి.
4. ఇప్పుడు ఒక గిన్నె లేదా పాత్రలో బార్లీ గింజలను వేయండి.
5. ఇప్పుడు ఈ గింజలను మీ చేతులతో పాత్ర అంతటా విస్తరించండి.
నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి
శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఇది అక్టోబర్ 12 వరకు కొనసాగుతుంది. 12వ తేదీన దసరా పండుగ జరుపుకుంటారు. నవరాత్రి మొదటి రోజున కలశ స్థాపన లేదా ఘటస్థాపన చేస్తారు. జొన్న లేదా బార్లీ ఘటస్థాపన సమయంలో మాత్రమే విత్తుతారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.