తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, పెద్దల సహకారం ఉంటుంది

వార ఫలాలు.. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, పెద్దల సహకారం ఉంటుంది

HT Telugu Desk HT Telugu

24 March 2024, 2:00 IST

  • Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. మార్చి 24వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

మార్చి 24వ తేదీ నుంచి 30 వరకు వార ఫలాలు
మార్చి 24వ తేదీ నుంచి 30 వరకు వార ఫలాలు (pinterest)

మార్చి 24వ తేదీ నుంచి 30 వరకు వార ఫలాలు

రాశిఫలాలు (వార ఫలాలు) 24.03.2024 నుండి 30.03.2024 వరకు

లేటెస్ట్ ఫోటోలు

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : ఫాల్గుణ

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. నూతన విషయాలను తెలుసుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసివచ్చును. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువులలో రాణిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. మేష రాశి వాళ్ళు మరింత శుభఫలితాలు పొందటం కోసం దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వార ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. స్నేహితులు, ఆత్మీయులతో కలిసిపోతారు. పనిలో ఒత్తిళ్ళు, ఇబ్బందులు కలుగుతాయి. ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. చిన్నపాటి మనస్పర్థలకు అవకాశముంది. మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారి సహకారం, పై అధికారుల ఆదరణ లభిస్తాయి. ప్రయాణాలలో వృథా ఖర్చులుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఉంటాయి. ఉన్నతాధికారుల సహకారానికి తగిన ప్రయత్నం అవసరం. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉంటాయి. ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత నష్టం జరగవచ్చు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. శుభకార్యాల నిర్వహణకు పెద్దల సహాయ సహకారాలు అవసరమవుతాయి. వృథా ఖర్చులుంటాయి. భార్యాపిల్లలతో ఆనందముగా గడిపెదరు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. సమాజంలో మంచి వ్యక్తులు పరిచయమవుతారు. భూములు, వ్యవసాయం, గృహ నిర్మాణ పనులు కలసివస్తాయి. వ్యాపార, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిరీత్యా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. క్రయవిక్రయాల వల్ల ఆదాయం పెరుగుతుంది. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా ఉంది. మీరు ప్రారంభించిన పనులు సరైన సమయంలో పూర్తవుతాయి. బంధువుల, స్నేహితుల సహాయంతో పనులు పూర్తిచేస్తారు. తల్లిదండ్రులు, పెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ఆలోచించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలలో భేదాభిప్రాయములు రావచ్చు. పరిష్కరించుకుంటారు. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్య నారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో ఆచి తూచి వ్యవహరించాలి. నిర్మాణం, భూములు, వాహనాల విషయాల్లో కలసివస్తుంది. కొన్ని విషయాలలో ఆర్థిక సమస్యల వల్ల పనుల్లో ఆలస్యం జరుగుతుంది. విష్ణు సహస్రనామం పారాయణ మరియు ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థంగా ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. ఆదాయం పెరిగినా సరిపడా ఖర్చులుంటాయి. రావలసిన డబ్బు వివాదాలతో చేతికి అందుతుంది. పనులు పూర్తవ్వడంలో ఆలస్యం. అతికష్టం మీద పనులు పూర్తి కావచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. వృథా ఖర్చులుంటాయి. వస్త్రాలు, వస్తువులను కొంటారు. వాహనాల విషయంలో ఖర్చులుండవచ్చు. భూములు, ఆస్తుల గొడవలు కొంతవరకు పరిష్కారమవుతాయి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వార ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారుల సహకారం ఉంటుంది. ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి పెద్దల సహకారం తీసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల రాకతో ఆనందముగా ఉంటారు. చిన్న చిన్న గొడవలు రావచ్చు. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన వారం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురిలో గౌరవమర్యాదలు పొందుతారు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పనులు పూర్తి చేసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులుంటాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో పైఅధికారుల సహకారముంటుంది. బంధువర్గంతో సత్సంబంధాలుంటాయి. పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహాయం ఆనందాన్నిస్తుంది. వివాదాలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు నుంచి ఉపశమనం. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు వల్ల ఇబ్బందిపడతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిర్మాణరంగం, వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు ఒప్పందాలలో కొంత జాగ్రత్త పడాలి. ఆగిపోయిన పనులలో కదలిక వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు పెద్దల సహకారంతో ముందుకు సాగుతాయి. డబ్బు ఆలస్యంగా అందుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. నూతన పరిచయాలతో పనులు నెరవేరతాయి. కొన్ని ఖర్చులు ముందుకు వస్తాయి. నలుగురికి సహాయపడే కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. చేతిలో ఉన్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. పనులు కలసివస్తాయి. ఆస్తుల విషయంలో గొడవలు పరిష్కారమవుతాయి. స్థిర, చరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. అన్నదమ్ములు, బంధువర్గంతో ఉన్న గత అభిప్రాయభేదాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు ఒప్పందాలు చేసుకుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులకు అనుకూలమైన వారం. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం