Today Rasi Phalalu : ఈ రాశివారు శనికి తైలాభిషేకం చేయడం మంచిది
Today Rasi Phalalu : ఈరోజు రాశి ఫలాలు తేదీ 16.09.2023 శనివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చూసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 16.09.2023, వారం: శనివారం, తిథి : పాద్యమి, నక్ష్మత్రం : ఉత్తర, మాసం : భాద్రపదం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మథ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శు భవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్బి కలుగుతుంది. మిత్రుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
వృషభరాశి
వృషభరాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బంధువర్గంతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. బుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలలో 'శ్రమాధిక్యత పెరుగుతుంది. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
మిథునరాశి
మిథునరాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. దైవ 'సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలనుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్ధిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన వాహన కోనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
తులా రాశి
తులారాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చికరాశికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. స్థిరాస్తి వివాదాలు మరింత బాధిస్తాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విషయమై పెద్దల సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. దైవచింతన పెరుగుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకరరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విలువైన వస్తాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ విషయంలో ముఖ్య నిర్ణయాలు అమలుచేస్తారు. రాజకీయల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవవు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగమున ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయవలసి వస్తుంది. దీర్హకాలిక సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.