తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: పచ్చ గన్నేరు చెట్టు.. ఇంటి ఆవరణలో ముఖ్యంగా ఆ ప్రదేశంలో ఉంటే చాలా మంచిది..

Vastu Tips: పచ్చ గన్నేరు చెట్టు.. ఇంటి ఆవరణలో ముఖ్యంగా ఆ ప్రదేశంలో ఉంటే చాలా మంచిది..

07 September 2022, 9:22 IST

google News
    • Vastu Tips : అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కొన్ని పాటిస్తే.. ఈ సమస్యలకు దూరం అవుతారని అంటున్నారు వాస్తు నిపుణులు. అయితే పచ్చగన్నేరు పూల మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి అంటున్నారు. దాని వల్ల కలిగేలాభాలేమిటో.. వాస్తు ప్రకారం వాటిని ఏ దిక్కున నాటితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చగన్నేరు
పచ్చగన్నేరు

పచ్చగన్నేరు

Vastu Tips : జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యలన్నీ చెట్టుతోనే పరిష్కారమవుతాయంటున్నారు వాస్తు నిపుణులు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి.. లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుంది అంటున్నారు. అదే పచ్చగన్నేరు చెట్టు. ఈ మొక్క ఎటువంటి సంరక్షణ లేకుండానే వర్ధిల్లుతుంది. పరిస్థితులు అనుకూలిస్తే శాశ్వతంగా జీవిస్తుంది. అయితే ఈ చెట్టును ఇంట్లో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు.

పచ్చగన్నేరు చెట్టుకు కాచే పువ్వులో ఒక్కో రకానికి ఒక్కో రంగు ఉంటుంది. మొత్తంగా ఈ పువ్వు మూడు నుంచి నాలుగు రంగులలో లభిస్తుంది. ఒక్కొక్క రంగుది ఒక్కో పాత్ర. ఈ నమ్మకం ప్రకారం.. తెల్లటి పువ్వు మా లక్ష్మికి ఇష్టమైనదని, పసుపు పుష్పం విష్ణువుకు చాలా ఇష్టమైనదని చెప్తారు. పైగా ఈ మొక్క పర్యావరణ శాస్త్రంలో కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

తెల్లటి రంగు పూల మొక్క

అయితే వాస్తు ప్రకారం ఏ మొక్కను ఎక్కడ ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం తెల్లటి రంగు గన్నేరు చెట్టును తూర్పు లేదా ఈశాన్య భాగంలో ఉంచాలి. ఇది ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే ఇది మా లక్ష్మికి ఇష్టమైన రంగు. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ చెట్టును ఇంట్లో ఉంచుకోవడం మంచిది.

పసుపు రంగు పూల మొక్క

పసుపు రంగు గన్నేరు చెట్టు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఏదైనా శుభకార్యానికి ముందు ఈ పూల చెట్టును ఇంటికి తీసుకురావచ్చు. అది మీ గౌరవాన్ని పెంచుతుంది. వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశద్వారం వద్ద ఈ పసుపు రంగు చెట్టును ఉంచినట్లయితే సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది.

హెచ్చరిక

అయితే ఈ చెట్టు విత్తనాలు విషపూరితమైనవి. కాబట్టి వీటిని పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవడం మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం