తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆదిత్య హృదయం పారాయణం చేస్తే ఆ రాశులవారికి మంచిది

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆదిత్య హృదయం పారాయణం చేస్తే ఆ రాశులవారికి మంచిది

30 October 2022, 5:30 IST

google News
    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 30వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (30-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి కలుగుతుంది. కష్టపడితే కాని పనులు పూర్తి కాని పరిస్థితి. పనుల్లో అలసత్వం వహిస్తారు. కుటుంబముతో గడుపుతారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకం పఠించండి.

వృషభ రాశి

ఈరోజు మధ్యస్తం నుంచి అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయములపై చర్చిస్తారు. భేదాభిప్రాయ సూచనలు అధికముగా ఉన్నవి. ఇష్టమైన వస్తువులు కొంటారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఆహ్లాదముగా గడుపుతారు. శుభవార్త వింటారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మిధున రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. కుటుంబముతో ఆహ్లాదముగా గడుపుతాపు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. పనులలో చికాకులు ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ధన సంబంధిత విషయాలలో ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కర్కాటక రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొంటారు. విశ్రాంతి దొరుకుతుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

సింహ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పవు. శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కన్యా రాశి

ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. శారీరక సౌఖ్యం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి.

తులా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. విశ్రాంతి పొందుతారు. శరీర సౌఖ్యం కోసం ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము, ధనలాభము కలుగుతుంది. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇష్టమైన వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఎదుటి వారి మన్నన పొందేందుకు ప్రయత్నం చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి.

ధనూ రాశి

ఈరోజు మధ్యస్త ఫలితాలున్నాయి. ఖర్చులు ఎక్కువ అవుతాయి. కుటుంబంతో గడుపుతారు. మీరు చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. శారీరక శ్రమ ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము, ప్రశాంతత కలుగును. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత ఆరోగ్య, కుటుంబ, వృత్తి వ్యాపారముల పట్ల శ్రద్ధ వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయము, నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

ఈరోజు మీకు మధ్యస్థమునుంచి అనుకూలంగా ఉంది. అవసరమైన వస్తువులు కొనడానికి ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో గడుపుతారు. కుటుంబములో చికాకులు ఏర్పడుతాయి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉన్నది. ప్రతీ పనిని ఆచితూచి చేయాల్సిన సమయము ఇది. ఖర్చులు పెరుగుతాయి. రాబడి తగ్గుతుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయము పఠించండి.

మీన రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్

తదుపరి వ్యాసం