Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే మంచిది
Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 29వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (29-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. చికాకులు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబం, మీ ఆనందము కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఖర్చులను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనలాభము, సౌఖ్యము పెరుగుతుంది. శత్రువులమీద విజయము సాధిస్తారు. కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అనవసరంగా సలహాలు ఇవ్వకుండా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం మంచిది.
మిధున రాశి
మిధున రాశివారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు వస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయము సాధిస్తారు. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు మధ్యస్తం నుంచి చెడు ఫలితాలున్నాయి. మానసిక ఘర్షణలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. సౌఖ్యము పొందుతారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి ఈరోజు మధ్యస్తంగా ఉన్నది. ఖర్చులు, చికాకులు, పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు లాభాలు, స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో కీర్తి, కుటుంబంలో గౌరవము పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము కలుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉంటే ఇంకా మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించండి. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యము కుదుటపడుతుంది. మీ కృషితో, పట్టుదలతో ముందుకు వెళ్లి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శనికి తైలాభిషేకం చేయండి. శివారాధన చేయడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. కొంత కాలంగా ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. చేసే ప్రతీ పని కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శనికి తైలాభిషేకం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
సంబంధిత కథనం
టాపిక్