Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఉద్యోగంలో చికాకులు, వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పవు
Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 22వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (22-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇష్టమైన వస్తువులు కొనేందుకు ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఇబ్బంది పెడతాయి. విభేదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.
వృషభ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.
మిధున రాశి
ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు, వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. కుటుంబములో కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణములో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.
సింహ రాశి
ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ప్రతీ పనిని పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన రోజు. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.
కన్యా రాశి
ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. అవసరాల కోసం ఖర్చు చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.
తులా రాశి
ఈరోజు మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచన, శారీరక శ్రమ, ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబముతో ఉల్లాసముగా గడుపుతారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.
ధనూ రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. శత్రువులతో జాగ్రత్త వహించండి. ప్రయాణములు అనుకూలిస్తాయి. వస్తువులు కొంటారు. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళనలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమిది. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
మకర రాశి
ఈరోజు మీకు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.
కుంభ రాశి
ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించండి. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగములో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.
మీన రాశి
ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మానసిక ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
సంబంధిత కథనం
టాపిక్