మూడు రాశుల వారికి మేలు చేయబోతున్న గ్రహాల రాజు- పెట్టుబడులు మంచి రాబడి ఇస్తాయి
07 November 2024, 14:54 IST
- గ్రహాల రాజు సూర్యుడు తన నక్షత్రం మార్చుకున్నాడు. స్వాతి నక్షత్రం నుంచి దేవగురువు బృహస్పతికి చెందిన విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని ప్రభావంతో మూడు రాశుల వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు కలగబోతున్నాయి. అవి ఏ రాశులో చూద్దాం.
బృహస్పతి నక్షత్రంలో సూర్యుడు
గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు ప్రస్తుతం తులా రాశిలో ఉన్నాడు. సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడు ఉత్తరాది ప్రజలు ఛత్ పండుగను జరుపుకుంటారు. సూర్యుడు రాశి మార్పుతో పాటు నిర్ధిష్ట కాలం తర్వాత నక్షత్రాన్ని మారుస్తాడు.
సూర్యుడు విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రానికి గురు గ్రహం అధిపతిగా వ్యవహరిస్తాడు. విశాఖ నక్షత్రం తుల, వృశ్చికరాశిని కలుపుతుంది. బృహస్పతికి చెందిన నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల చాలా రాశులవారు ప్రభావితమవుతారు. ముందుగా సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. నవంబర్‌లో మళ్లీ సూర్యుడు తన రాశిని మారుస్తాడు. దీని ప్రభావం ఏ రాశుల వారిపై ఉంటుందో తెలుసుకుందాం.
విశాఖ నక్షత్రం గుణగుణాలు
విశాఖ నక్షత్రం మీద గురు బలం అధికంగా ఉంటుంది. గారాబంగా పెరుగుతారు. అనుకున్నది చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకునేందుకు ఆసక్తి చూపించరు. కాస్త మొండి స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఉన్న ప్రతికూల అంశం ఏమిటంటే ఎవరైన వీళ్ళకు సహాయం చేసిన వారికి తిరిగి ఏదైనా చేయాల్సి వస్తే చేసేందుకు అసలు ఇష్టపడరు. కానీ వీళ్ళు సాయం చేస్తే మాత్రం తెగ గొప్పలు చెప్పుకుంటారు. కుటుంబం మీద తప్ప ఇతరుల మీద ప్రేమ చూపించరు. ఇతరులతో ఎక్కువగా వాదనలు చేస్తారు.
ఏ రాశుల వారు ప్రభావితం అవుతారు
సూర్యుని నక్షత్ర మార్పు అనేక రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశిచక్రాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఇవి మేషం, వృశ్చికం, తుల రాశులు. అన్నింటి కంటే వాటిలో అతిపెద్ద ప్రభావం తులా రాశి మీద ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ప్రస్తుతం తులా రాశిలో ఉన్నాడు.
సూర్యుడు సంచరిస్తున్న రాశి కూడా తులా రాశితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి వారు అనేక రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీకు గౌరవం వస్తుంది. మీరు కుటుంబంలో కూడా గౌరవించబడతారు. తండ్రితో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. మేష రాశి వారికి ఎలాంటి జబ్బు అయినా నయమవుతుంది. పెట్టుబడి ద్వారా లాభదాయకమైన సంకేతాలు ఉన్నాయి. ఇది కాకుండా వృశ్చిక రాశి వారు కూడా అనేక విధాలుగా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగంలో, పదోన్నతి లభిస్తుంది. అలాగే కొత్త ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ నాయకత్వ లక్షణాలు మీకు ఈ ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఈ ప్రభావం చాలా తక్కువ వ్యవధిలో ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు తన రాశి లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు వాటి ప్రభావం వేరే రాశుల మీదకు వెళ్తుంది.
నవంబర్‌లో సూర్యుడు రాశి మార్పు
నవంబర్‌లో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. నవంబర్ 16న సూర్యుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు నాయకత్వ సామర్థ్యం, ఆత్మ, తండ్రి మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.