Budhaditya yogam: తులా రాశిలో బుధాదిత్య యోగం- ఎలాంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో చూడండి
Budhaditya yogam: ప్రస్తుతం తులా రాశిలో సూర్యుడు, బుధుడు సంచరిస్తున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. దీని ప్రభావం మానవ జీవితం మీద ఎలా ఉంటుందో జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. రెండు గ్రహాల శుభ కలయిక ఎవరికి అదృష్టాన్ని, ఎవరికి దురదృష్టాన్ని మిగులుస్తుందో చూద్దాం.
ప్రతి గ్రహం తన రాశిని ఎప్పటికప్పుడు మారుస్తుంది. గ్రహాల సంచారం ఒకే రాశిలో అనేక గ్రహాల ఉనికికి దారితీస్తుంది. ఈ సమయంలో గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు తులా రాశిలో కలిసి ఉంటారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం తులారాశిలో సూర్యుడు, బుధుడు ఉండటం మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తులా రాశిలో ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ యోగం ధన త్రయోదశి వరకు ఉంటుంది. ఆ తర్వాత బుధుడు తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. ఈ యోగం ప్రభావంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పండితులు ద్వారా తెలుసుకుందాం.
బుధాదిత్య యోగం
తులా రాశిలో సూర్యుడు, బుధుడి కలయిక మంచి కలయికగా పరిగణిస్తారు. రెండు గ్రహాల కలయిక బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది. వాస్తవానికి సూర్యుడికి ఇది బలహీన రాశి. అయినప్పటికీ సూర్యుడు ఈ రాశిలో క్షీణించినా ఎలాంటి సమస్యా ఉండదు. సూర్యుడు తులా రాశిలో నీచ కాల పురుషుని ఏడవ ఇల్లు. సూర్యుడు బుధ గ్రహంతో కలిసి ఉండటం వల్ల ప్రజలకు శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు బుధగ్రహంతో స్నేహంగా ఉంటాడు. ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లదు, అధికార పార్టీకి మేలు జరుగుతుంది. ప్రజల పరిస్థితి ఆర్థికంగా మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దృక్ పంచాంగ్ ప్రకారం బుధుడు అక్టోబర్ 10 న తులా రాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 29, 2024 వరకు ఈ రాశిలో ఉంటాడు. బుధుడు అక్టోబర్ 29 రాత్రి 10:44 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని తులా రాశి సంచారం అక్టోబర్ 17న జరిగింది. నవంబర్ 16న ఉదయం 07:41 గంటలకు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.
తులా రాశిలో బుధ ప్రభావం
తులా రాశిలో బుధ సంచారం శుభ సూచికంగా చెప్తారు. ఈ రాశిలో బుధుడు మంచి స్థితిలో ఉన్నాడు. దీని ప్రభావంతో శత్రువులు కూడా మిత్రులు అవుతారు. నరాలకు సంబంధించి సమస్యలు దూరమవుతాయి. అదృష్టం మీకు మద్ధతుగా ఉంటుంది. మేధో శక్తి పెరుగుతుంది. ఆర్థికంగా ప్రజలకు మేలు చేస్తుంది. శుభవార్తలు అందుకుంటారు. పనిలో విజయం సాధిస్తారు.
సూర్యుడి సంచార ప్రభావం
తులా రాశిలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. చాలా అరుదుగా సానుకూల ప్రభావాలను ఇస్తాడు. కొన్ని రాశులకు మేలు చేస్తే మరికొన్ని రాశులకు మాత్రం అశుభ ప్రభావాలు ఇస్తుంది. ఈ సమయంలో కోపం పెరుగుతుంది. శక్తి, ఉత్సాహం లోపిస్తుంది. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు సమస్యలుగా మారతాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అదృష్టం అన్ని వేళలా సహాయకారిగా ఉండకపోవచ్చు. కుటుంబ కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలి. లేదంటే ఇతరులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.