కార్తీక మాసంలో శని త్రయోదశి చాలా విశేషం.. శని దోషాలు తగ్గుతాయంటున్న చిలకమర్తి
22 November 2023, 17:42 IST
- 25 నవంబర్ 2023 కార్తీక మాస శుక్ల పక్ష తిథి రావటం, ఆరోజు శనివారం (స్థిరవారం) అవ్వడం చేత ఈ శని త్రయోదశి చాలా విశేషమైనదిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శని త్రయోదశి రోజు శని భగవానుడి ఆశీస్సులు పొందండి
కార్తీకమాసం చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో ప్రతీరోజు చాలా పవిత్రమైనది. అయితే ఈ సంవత్సరం శ్రీ శోభకృత్ 25 నవంబర్ 2023 కార్తీక మాస శుక్ల పక్ష తిథి రావటం ఆరోజు శనివారం (స్థిరవారం) అవ్వడం చేత ఈ శని త్రయోదశి చాలా విశేషమైనదిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కార్తీక మాసంలో శనివారం త్రయోదశి కలసిరావడం శనిత్రయోదశి నాడు నవగ్రహ పూజలకు, శివారాధనలకు, శని ఈతిబాధలను తొలగించుకోవడానికి ప్రత్యేకం. అటువంటి శని త్రయోదశి శివుడికి ప్రీతికరమైన కార్తీకమాసంలో రావటం చాలా విశేషమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
గోచారపరంగా ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమశని వంటి ఇబ్బందులు పడుతున్నారో, జాతకంలో శని దోషాలు వలన శని మహర్దశ, అంతర్దశ వలన ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఆ దోష నివృత్తి చేసుకోవడానికి ఒక అద్భుత అవకాశం అని చిలకమర్తి తెలిపారు.
ఈ సంవత్సరం శని కుంభరాశిలో సంచరించుట వలన 25వ తారీఖు వచ్చినటువంటి శని త్రయోదశి మకర కుంభ మీనరాశుల వారికి కర్కాటక మరియు వృశ్చికరాశి వారికి శని భగవానుని పూజించడానికి నవగ్రహ ఆలయాల్లో శాంతులు చేసుకోవడానికి శివాలయాల్లో అభిషేకాలు చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశమని, ఇలా ఆచరించడం వలన వారికి తగులుతున్న శని దోషాలు తగ్గుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు ఏమి చేయాలంటే...
ఈరోజు ఉదయం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానమాచరించడం, తలస్నానం వంటివి ఆచరించడం మంచిది. ఈరోజు నవగ్రహ ఆలయాల్లో శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం వంటివి, నవగ్రహ ఆలయాలను దర్శించి అక్కడ శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది.
ఈరోజు శివాలయాల్లో అభిషేకం వంటివి ఆచరించడం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు ఉపవాసం, నక్తం వంటివి ఆచరించడం నూనె పదార్థాలు వంటివి స్వీకరించకుండా ఉండటం మంచిదని చిలకమర్తి తెలిపారు.