Bad luck Dreams: కలలో మీకు ఇవి కనిపిస్తున్నాయా? దురదృష్టం రాబోతుందని చెప్పే ముందస్తు హెచ్చరికలు ఇవి
30 May 2024, 9:11 IST
- Bad luck Dreams: కొన్ని సంఘటనలు కలలో కనిపిస్తే అవి మీకు రాబోయే ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. దురదృష్టం రాబోతుందని తెలుపుతూ కొన్ని కలలు వస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
కలలో మీకు ఇవి కనిపిస్తే దురదృష్టం రాబోతుంది
Bad luck Dreams: ప్రతి ఒక్కరికి రోజు ఏదో ఒక వస్తూనే ఉంటుంది. కానీ కొన్ని సంతోషాన్ని ఇస్తే మరికొన్ని భయపెట్టే విధంగా ఉంటాయి. కొన్ని కలలు మనసును తాకుతాయి. వాటి గురించి రోజంతా ఆలోచిస్తూ ఉంటారు.
కొన్నిసార్లు మన జీవితంలో ఎప్పుడూ చూడని సంఘటనలు లేదా వస్తువులను కలలో చూస్తుంటాము. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే సంఘటనలు వస్తువులకు కొన్ని అర్థాలు ఉంటాయి. కలలో కొన్ని వస్తువులు చూడటం దురదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు. అవి ఏంటో తెలుసుకుందాం.
విరిగిన అర్థం
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో విరిగిన అద్దం కనిపిస్తే దురదృష్టానికి సూచికగా పరిగణిస్తారు. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సొంత భావాలు లక్ష్యాలు లేదా ఆశయాలు పక్కదారి పట్టే అవకాశం ఉందని సూచిస్తుంది . రెండోది భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకోవడం, ప్రేమికుల విడిపోవడం, సన్నిహితంగా ఉన్నవారితో మీ సంబంధం మీ విచ్చిన్నం కాబోతుందని అర్థం. విరిగిన అద్దం కలలో కనిపిస్తే ప్రతికూల శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి.
చిరిగిన వస్త్రాలు
చిరిగిన బట్టలు కలలో కనిపిస్తే మీ లక్ష్యాలు, ఆశయాలకు సంబంధించినదిగా స్వప్న శాస్త్రం చెబుతోంది. చిరిగిన బట్టలు, చెల్లాచెదురుగా వస్త్రాలు భవిష్యత్తులో మీరు ఎదుర్కోబోయే వైఫల్యాలను సూచిస్తాయి. మీకు ఏదో ముప్పు రాబోతుందని తెలియజేస్తుంది. జీవితం పూర్తిగా చిన్నాభిన్నమైనప్పుడు , మనసులో అభద్రతా భావం నెలకొన్నప్పుడు, అస్థిరత ఏర్పడినప్పుడు ఇటువంటి కలలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఒక దురదృష్ట సంకేతంగా పరిగణించాలి.
తుఫాను, లోతైన జలపాతాలు
చాలామందికి ఎక్కువగా తుఫాను, లోతైన జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి. తరచుగా తుఫాను వచ్చినట్లు కలలు కనిపిస్తే కుటుంబ కలహాలు ఏర్పడతాయని అర్థం. లోతైన జలపాతాలు కనిపిస్తే భావోద్వేగంగా అల్లకల్లోలం అవుతారని సూచిక . ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు కనిపిస్తే మీరు సమస్యలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని అర్థం. ఇటువంటి కలలు దురదృష్టంతో సంబంధం కలిగి ఉంటాయి. జీవితంలో భావోద్వేగ గందరగోళం ఏర్పడుతుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తుంది.
కలలో గందరగోళంగా ఉండటం
కొందరికి తరచూ ఇటువంటి కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని కలలు గందరగోళానికి గురిచేస్తాయి. ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. కొన్నిసార్లు కలలో మీరు దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంటారు. ఇవి హెచ్చరిక సంకేతాలుగా పరిగణించాలి. మీ లక్ష్యాలు నిర్ణయాలను మరొకసారి సమక్షించుకోవాల్సి ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇటువంటి కలలు ముందస్తు హెచ్చరికలుగా పరిగణించాలి. అప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాబోయే ప్రమాదాలను మీరు ఎదుర్కోగలరు.
దంతాలు ఊడిపోవడం
స్వప్న శాస్త్రం ప్రకారం దంతాలు బలం, కమ్యూనికేషన్, స్వీయ వ్యక్తీకర్నాకు చిహ్నాలు. కలలో పళ్ళు కోల్పోవడం కనిపిస్తే అభద్రత రాబోయే దురదృష్టాన్ని సూచిస్తుంది. మీ అధికారం చేజారిపోయే ప్రమాదం ఉంది. దంతాలు పడిపోయినట్లు కల వచ్చిందంటే అది చాలా ప్రమాదకరమైనదిగా భావించాలి. ఈ కల సంకేతం ప్రతికూల శక్తిని ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. మీ అధికారాన్ని చేజార్చుకోకుండా ఉండే మార్గాలను అన్వేషించడం చాలా అవసరం.