Dreams: బ్రహ్మ ముహూర్తంలో మీకు ఈ కలలు వస్తున్నాయా? వాటి అర్థం ఏంటో తెలుసా?-do you get these dreams during brahma muhurt do you know what they mean ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dreams: బ్రహ్మ ముహూర్తంలో మీకు ఈ కలలు వస్తున్నాయా? వాటి అర్థం ఏంటో తెలుసా?

Dreams: బ్రహ్మ ముహూర్తంలో మీకు ఈ కలలు వస్తున్నాయా? వాటి అర్థం ఏంటో తెలుసా?

Gunti Soundarya HT Telugu
May 23, 2024 06:07 PM IST

Dreams: బ్రహ్మ ముహూర్తం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో వచ్చే కొన్ని కలలు అదృష్టం పట్టబోతుందని చెప్పే సంకేతాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. మరి ఆ కలలు ఏంటి? వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం.

బ్రహ్మ ముహూర్తంలో ఈ కలలు వచ్చాయా?
బ్రహ్మ ముహూర్తంలో ఈ కలలు వచ్చాయా? (pexels)

Dreams: హిందూ శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. నిత్యం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచే వ్యక్తి జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.

yearly horoscope entry point

ఈ సమయంలో నిద్రలేచి ధ్యానం చేసినా, చదువుకున్నా అది చాలా మేలు చేస్తుంది. మీ ఏకాగ్రతను పెంచుతుంది. కొంతమందికి ఈ సమయంలో కలలు వస్తాయి. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని చాలా మంది చెప్తూ ఉంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కొన్ని కలలు శుభానికి సంకేతంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం తెల్లవారుజాము 3 గంటల నుంచి 5 గంటల మధ్య కనిపించే కలలు నిజమవుతాయని అంటారు. బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు మీ అదృష్టాన్ని కూడా మార్చగలవని స్వప్న శాస్త్రం చెబుతోంది. మరి ఆ కలలు ఏంటి? వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం.

నదిలో స్నానం చేస్తున్నట్టు వచ్చిందా?

స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో మీరు నదిలో స్నానం చేయడం లేదా ఎవరైనా చేస్తున్నట్టు కనిపించినా అది శుభ సంకేతం. దీని అర్థం మీరు కూరుకుపోయిన నష్టాల నుంచి బయట పడతారని లేదా అప్పుగా ఇచ్చిన డబ్బుని తిరిగి పొందబోతున్నారని. అలాగే మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంది.

ధాన్యాల కుప్పను చూస్తే

బ్రహ్మ ముహూర్త సమయంలో మీరు ధాన్యాల కుప్పను కలలో కనిపించినా లేదంటే మీరు దాన్ని ఎక్కినట్టు కలగన్నా అది శుభ సంకేతం కావచ్చు. భవిష్యత్ లో మీరు భారీగా లాభాలు పొందుతారు అనే దానికి సంకేతం.

నవ్వుతున్న పిల్లవాడు కనిపిస్తే

స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో నవ్వుతున్న పిల్లవాడు లేదా సరదాగా ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తే మీకు స్వర్ణ కాలం ఇప్పుడే ప్రారంభం కాబోతుందని అర్థం. అంటే మీకు అతి త్వరలో లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించబోతుందని, చాలా సంపదను పొందుతారని అర్థం.

పళ్ళు విరిగిపోయినట్టు కనిపిస్తే

బ్రహ్మ ముహూర్తంలో దంతాలు విరిగిపోయినట్టు కనిపిస్తే మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు అనే దానికి సంకేతం. స్వప్న శాస్త్రం ప్రకారం దంతాలు విరిగిపోయినట్టు కలలో కనిపించడం చాలా శుభ సంకేతం.

నీటి కుండ కనిపిస్తే

కలలో నీటి కుండ కనిపిస్తే అది కూడా శుభ సూచికమే. స్వప్న శాస్త్రం ప్రకారం భవిష్యత్ లో మీరు అపారమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఆస్తిలో లాభాలు కలుగుతాయి.

ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు చూస్తే

బ్రహ్మ ముహూర్తంలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు కనిపించడం కూడా మంచి సంకేతంగా భావిస్తారు. మీరు చాలా డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. మీ ఆర్థిక స్థితి బలపడుతుందని సంకేతం.

మరణించిన వాళ్ళు కనిపిస్తే

చాలా మందికి తరచుగా వచ్చే కల ఇదే. కలలో మరణించిన పూర్వీకులను చూడటం చాలా శుభం, అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు ధనవంతులు కావడానికి వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అంతులేని సంపదను పొందుతారు.

Whats_app_banner