Swapna Shastra : కలలో ఈ జంతువులను చూడటం మార్పునకు సంకేతం.. మీరు చూశారా?-what is the meaning of seeing animals in dream according to swapna shastra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Swapna Shastra : కలలో ఈ జంతువులను చూడటం మార్పునకు సంకేతం.. మీరు చూశారా?

Swapna Shastra : కలలో ఈ జంతువులను చూడటం మార్పునకు సంకేతం.. మీరు చూశారా?

Anand Sai HT Telugu
May 03, 2024 08:00 PM IST

Dream Science In Telugu : సాధారణంగా మనం కలలు కంటాం. ఒక్కోసారి జంతువులు కూడా కనిపిస్తాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం వాటికి కూడా అర్థం ఉంది.

స్వప్న శాస్త్రం
స్వప్న శాస్త్రం

మనం చూసే ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. కలలో కనిపించే ఆలోచనలు కూడా భవిష్యత్తును సూచిస్తాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి అయితే, కొన్ని కలలు అశుభకరమైనవి. కలలు సాధారణంగా వస్తాయి. అయితే వాటిని మనం తేలిగ్గా తీసుకుంటాం. కానీ స్వప్న శాస్త్రం మాత్రం కలల గురించి వివరిస్తుంది. ఎలాంటి కలకు ఏం అర్థం ఉందో తెలుపుతుంది. మీరు కలలో కొన్ని రకాల పక్షులు, జంతువులను చూసి ఉంటారు. జంతువులను చూస్తే అర్థమేంటో తెలుసుకుందాం..

స్వప్న శాస్త్రంలో జంతువులను చూసే కల గురించి వివరణ ఉంది. స్వప్న శాస్త్రం ప్రకారం కింద చెప్పే 5 జంతువులను కలలో చూడటం శుభం అని చెప్పబడింది. అయితే ఆ జంతువులు ఏవి? ఆ జంతువులకు కలలో చూస్తే ఏమవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆవు

హిందూ మతంలో ఆవును గౌరవిస్తారు. ప్రజలు ఆవును తల్లిగా భావిస్తారు. కలలో ఆవును చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీకు కలలో మచ్చలున్న ఆవు కనిపిస్తే వడ్డీ వ్యాపారంలో లాభం ఉందని అర్థం చేసుకోండి. మీ కలలో పాలు ఇస్తున్న ఆవు కనిపిస్తే, అది ఆనందం, శ్రేయస్సును సూచిస్తుంది. మీ కుటుంబంలో శ్రేయస్సు నివసిస్తుందని అర్థం.

సింహం

మీకు కలలో సింహం కనిపిస్తే మీకు రాజయోగం వస్తుందని అర్థం. నిజానికి సింహాన్ని అడవికి రాజుగా చూస్తారు. అందుకే కలలో సింహం ధైర్యవంతులకు ప్రతీక. అలాంటి వారు ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారు. ఏ విషయంలోనూ భయపడకుండా ముందుకు వెళ్తారని ఇది అర్థం.

పాము

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పాము కనిపించడం కూడా శుభప్రదం. ఇది విజయానికి సంకేతం. మీరు కలలో పామును పట్టుకుంటే, మీరు కచ్చితంగా మీ లక్ష్యాలను సాధిస్తారని ఊహించుకోండి. పాము పుట్టను చూస్తే ధనలాభం కలిగే అవకాశం ఉంది.

ఏనుగు

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఏనుగు అడవిలోని అత్యంత శక్తివంతమైన జంతువులలో ఒకటిగా చెబుతారు. ఏనుగు విజయం, పెరుగుదల, శక్తి, గౌరవానికి చిహ్నం. కలలో ఏనుగు కనిపిస్తే అది మీకు మేలు చేస్తుంది. మీరు ఏనుగుపై స్వారీ చేయడాన్ని చూస్తే, అది మీ సామర్థ్యాన్ని చూపుతుంది. గర్భిణీ స్త్రీకి కలలో ఏనుగు కనిపిస్తే పుట్టబోయే బిడ్డ సురక్షితంగా ఉంటుంది.

కోతి

కలలో ఒక కోతి వర్షంలో తడిసిపోతున్నట్లు మీరు చూసినట్లయితే, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే బలమైన అవకాశం ఉంది. కానీ కలలో కోతి ఇతర జంతువులతో పోట్లాడటాన్ని చూడటం అశుభ సంకేతం. మీ బంధువులు, స్నేహితులు లేదా బంధువులతో మీరు గొడవ పడే అవకాశం ఉందని దీని అర్థం.

స్వప్న శాస్త్రం వివిధ రకాల కలలు వాటి అర్థాలను చెబుతుంది. కలలో కనిపించేవి భవిష్యత్తుకు సంకేతమని నమ్ముతారు. అయితే మీకు ఎలాంటి కలలు వస్తున్నాయో అది కూడా అర్థం చేసుకోవాలి. మనం చూసే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుంది. అలాగే జంతువులను చూడటం కూడా వివిధ అర్థాలను తెలుపుతుంది. ఇందులో కొన్ని శుభం, మరికొన్ని అశుభం కూడా ఉంటాయి.