Saturn Blessings: 2025లో శని కదలికలో మార్పు- మీకు శుభ సూచకమా లేక అశుభ తెలుసుకొండి, శని ఆశీర్వాదం పొందండి
20 November 2024, 15:34 IST
- 2025 నూతన సంవత్సరంలో శని కదలికల్లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఈ ఏడాది మీకు శుభ సూచకమా లేక అశుభమా తెలుసుకునేందుకు మీకు కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే సంతోషంగా ఉండచ్చు.
శని దేవేడి అనుగ్రహం మనపై ఉందాల లేదా తెలుసుకోవడం ఎలా
జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయ దేవుడుగా పరిగణిస్తారు. శని ప్రతి మనిషికి అతని కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు. శని రాశిచక్రాన్ని మార్చినప్పుడు అది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శని అంటే అందరికీ భయం. ఎందుకంటే ఈయన మీపై ఆగ్రహిస్తే.. మీ జీవితం కష్టాలతో నిండిపోతుంది. ప్రతి మనిషిలో క్రమశిక్షణ, పొరాటం ఉండాలని కోరుకుంటాడు. అలాంటి వారికే విజయాన్ని ఇస్తాడు. శనిదేవుడు మనపై కోపంగా ఉంటే జీవితంలో ఎన్నో సంక్షోభాలు వస్తాయి. అలాగే అతని అనుగ్రహం మీపై ఉంటే.. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే కొన్ని సంకేతాలతో శని అనుగ్రహం మనపై ఉందో లేదో తెలుసుకోవచ్చు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2025 లో శని కదలిక
నవంబరు 15 2024న శని తన గమనాన్ని మార్చుకున్నాడు. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో ప్రత్యక్షంగా సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది జూలై 2025 వరకు ఈ మార్గంలోనే ఉంటాయి. రాబోయే సంవత్సరంలో శని తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. జులై 2025లో శని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. శని గమనంలో చోటు చేసుకుంటున్న ఈ మార్పుల ప్రభావం మీపై ఎలా పడుతోంది. 2025లో శని మీకు శుభసూచకమా.. అశుభమా అనే విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ లక్షణాలు మీలో కనిపిస్తే శని ప్రభావం మీపై చెడుగా ఉందని అర్థం:
శని ప్రభావం మీపై శుభప్రదంగా ఉంటే మీరు ఎప్పుడూ చురుగ్గా, తెలివిగా వ్యవహరిస్తారు. అలా కాకుండా అశుభంగా ఉంటే మీరు సోమరిపోతుగా మారతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. కారణాలేవైనటప్పటికీ తరచూ ఉద్యోగాలు మారుస్తూ ఉంటారు. మీలో క్రమశిక్షణ లోపిస్తుంది. మీ కుటుంబీకులు, ఉద్యోగులు, సన్నిహితులు ఎవ్వరూ మీతో సంతోషంగా ఉండరు. అంతేకాదు మీ మీద శని ప్రభావం చెడుగా ఉన్నప్పుడు మీరు మాట మీద నిలబడలేరు. శక్తి హీనంగా ఉంటారు. నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వ్యాపారంలో కూడా నష్టాలు వాటిల్లుతాయి.
శని సంచారాన్ని శుభసూచకంగా మార్చడం ఎలా?
శని ప్రభావం మీపై చెడుగా ఉన్నప్పుడు మీరు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శని అనుగ్రహం పొందడానికి క్రమ శిక్షణ చాలా ముఖ్యం. అంతేకాకుండా..
- శని అనుగ్రహం మనపై శుభసూచకంగా ఉండాలంటే గోళ్లను, జుట్టును ఎప్పటికప్పుడు కత్తిరించాలి. లేదంటే శని ఆగ్రహిస్తాడు.
- ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉండండి. ప్రతిరోజూ స్నానం చేయాలి.
- శనివారం రోజు పేదవాడికి ఆహారం, బట్టలు లేదా ధన సహాయం చేయాలి.
- కోపం, చికాకు తగ్గించుకోవాలి. ఎవరితోనూ చెడుగా మాట్లాడవద్దు.
- కాలం చెల్లినవి, పాడైపోయిన ఆహారాన్ని తినవద్దు.
- ఆహారంలో మినుములు, నల్లని పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
- శని దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే.. అతను తన భక్తులను కష్టాల నుంచి రక్షిస్తాడు. అటువంటి పరిస్థితిలో శని దేవుడి అశుభ ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం శని దేవుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పించండి. అలాగే రుద్రాక్ష జపమాలతో ఓం శనిశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి.
- శని దేవుడు తన భక్తులను ఎప్పుడూ వేధించనని బజరంగబలికి వరం ఇచ్చాడు. అందుకే శనివారం నాడు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.