Paurnami: పౌర్ణమి రోజున ఇలా చేశారంటే లక్ష్మీ దేవి కటాక్షం.. అప్పుల బాధలే ఉండవు
23 January 2024, 11:00 IST
- Paurnami: పౌర్ణమి రోజు మూడు రాజ యోగాలు ఏర్పడటం వల్ల ఆరోజుకి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం పౌర్ణమి రోజు ఈ పరిహారాలు పాటిస్తే మంచిది.
లక్ష్మీదేవి
Paurnami: పుష్య మాసంలో వచ్చే పౌర్ణమిని పుష్య పౌర్ణమి అంటారు. సనాతన ధర్మంలో పౌర్ణమి రోజున స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది పౌర్ణమి జనవరి 25 న్ వచ్చింది. కొన్ని మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇంటికి ఆనందం, శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు.
పౌర్ణమి శుభ సమయం
హిందూ పంచాంగం ప్రకారం పుష్య మాసంలో పౌర్ణమి తేదీ 2024, జనవరి 24 రాత్రి 9.24 గంటలకి ప్రారంభంఅవుతుంది. మరుసటి రోజు జనవరి 25 రాత్రి 11.23 గంటలకి ముగుస్తుంది. అందుకే ఉదయతి ప్రకారం జనవరి 25 నే పౌర్ణమి జరుపుకుంటారు. ఈసారి పౌర్ణమి రోజున సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, గురు పుష్య యోగం వంటివి ఏర్పడబోతున్నాయి. ఈ పవిత్రమైన యోగంలో స్నానం ఆచరించి, దాన ధర్మాలు, ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల ఎన్నో రెట్లు ప్రతిఫలం పొందుతారు. అందుకే ఈ పౌర్ణమి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.
పుష్య పౌర్ణమి ప్రాముఖ్యత
పౌర్ణిమ రోజు చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు సూర్యుడేవుడితో పాటు చంద్ర దేవుడిని కూడా పూజిస్తారు. స్నానం చేసి ధార్మిక కార్యాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేవాలి. పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి. లేదంటే గతంలో తీసుకొచ్చిన గంగాజలం ఇంట్లో ఉంటే వాటిని నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. సూర్యుడికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు నిరుపేదలకు, బ్రహ్మణులకి దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు.
లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే మార్గాలు
పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారు. తామర పువ్వులు పూజలో సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్ముతారు. పూజ సమయంలో లక్ష్మీదేవికి అలంకరణ సామాగ్రిని సమర్పించాలి. ఇలా చేస్తే ధన కొరత తొలగిపోతుంది. సంపద పెరుగుతుంది. ఈ పరిహారం పాటించడం వల్ల సంపద, శ్రేయస్సుని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
సంపద పొందేందుకు
పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి 11 పసుపు గోధుమలు సమర్పించండి. అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రంలో వాటిని మూట కట్టి సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ పరిహారం పాటించడం వల్ల ధనభారం తొలగిపోయి సంపద రాక పెరిగేందుకు మార్గాలు తెరుచుకుంటాయని నమ్ముతారు. ఇది మాత్రమే కాదు పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి. నైవేద్యం సమర్పించాలి. అనంతరం కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం,విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ పరిహారాలు పాటించడం వల్ల డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.