Venus transit: ఈ రాశుల మీద లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం-venus transit effect on these zodiac signs will get lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: ఈ రాశుల మీద లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం

Venus transit: ఈ రాశుల మీద లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం

Gunti Soundarya HT Telugu
Published Jan 20, 2024 08:40 AM IST

Venus transit: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శుక్రుడు తన రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల వాళ్ళు లక్ష్మీదేవి కటాక్షం పొందబోతున్నారు.

లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులు ఇవే
లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులు ఇవే (freepik)

Venus transit: అసురుల అధిపతి శుక్రుడు తన రాశి చక్రాన్ని మార్చుకున్నాడు. రెండు రోజుల క్రితం శుక్రుడు ధనుస్సు రాశిలో ప్రవేశించాడు. ప్రేమ, ఆకర్షణ, కళలు, సాహిత్యం, అందం, సంపద, వైభవానికి ప్రతీకగా శుక్రుడిని భావిస్తారు. శుక్రుడు బృహస్పతి రాశిలోకి ప్రవేశించడం వల్ల అన్ని రాశుల మీద సానుకూల, ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ఫిబ్రవరి 11 వరకు శుక్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. ఆరోజు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారి శుభ సమయం మొదలవుతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం శుక్రుడు రాశి మారడం వల్ల కొన్ని రాశిల మీద లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. రాబోయే ఇరవై రోజుల పాటు ఈ రాశుల వారికి అదృష్టం వెన్నంటే ఉండనుంది. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.

మేష రాశి

శుక్రుడు ధనుస్సు రాశిలోకి రావడం వల్ల పనిలో అదృష్టం బలపడుతుంది. గౌరవం, శౌర్యం పెరిగే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. భాగస్వామ్య పని పెరుగుతుంది. సంపదకి కొత్త వనరులు కనుగొంటారు. ఆదాయం లభిస్తుంది.

వృషభ రాశి

కార్యాలయంలో, వ్యాపారంలో మీకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. తోటి వారి సహాయంతో క్లిష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆకస్మిక లాభాలకి అవకాశాలు లభిస్తాయి. మనసులో ఆనందం వెల్లివిరుస్తుంది. బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంపద పెరిగే అవకాశం ఉంది.

మిథునం

భాగస్వామ్య పనుల వల్ల లాభం పెరుగుతుంది. రోజువారీ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. దాంపత్య సుఖం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో విహార యాత్రలకి ఖర్చు పెడతారు. బోధన, అభ్యసనలో పురోగతి సాధిస్తారు.

కర్కాటక రాశి

సుఖ సంతోషాలు లోపించాయనే భావన కలుగుతుంది. గృహ, వాహనానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.

సింహం

శుక్ర సంచారం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. సహోద్యోగుల నుంచి మద్దతు మీకు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులపై పనులు ప్రారంభిస్తారు. వ్యాపారంలో ఆకస్మిక లాభాలకి ఆస్కారం ఉంటుంది. కొత్త పెట్టుబడులకి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం విస్తరించేందుకు అవకాశాలు దొరుకుతాయి. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. సామాజిక ప్రతిష్ఠ, కీర్తి పెరుగుతాయి.

కన్య రాశి

సహోద్యోగులు, అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళతారు. కష్టమైన పనులు కూడ సులువుగా పూర్తి చేసేస్తారు. అనుభవం ఉన్న వ్యక్తిని సంప్రదించిన తర్వాత ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం మంచిది. అవసరమైన సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది.

 

Whats_app_banner