Indira ekadashi 2024: ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? ఎప్పుడు జరుపుకోనున్నారు?
21 September 2024, 19:06 IST
- Indira ekadashi 2024: భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఏకాది ప్రాముఖ్యత ఏంటి? ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం.
ఇందిరా ఏకాదశి
Indira ekadashi 2024: హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఈ ఏడాది ఇందిరా ఏకాదశి ఉపవాసం పితృ పక్ష సమయంలో వస్తుంది. పూర్వీకుల మోక్షానికి ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి పాపాలు నశించడమే కాకుండా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండే వ్యక్తి ఏడు తరాల వరకు వాళ్ళ పూర్వీకుల దగ్గరకు వెళతాడని చెబుతారు. తన పూర్వీకులు కూడా పుణ్యాన్ని పొందుతారు. వారు తమ పితృలోకం నుండి విముక్తి పొంది స్వర్గంలో స్థానం పొందుతారు.
ఇందిరా ఏకాదశి రోజున భక్తులు శ్రీమహావిష్ణువును పూజిస్తారు, ఉపవాసం ఉంటారు. భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. శ్రీమహావిష్ణువును పూజించి ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల భక్తులు సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ఇందిరా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.
ఏకాదశి తిథి ఎప్పుడు?
ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభమై 28 సెప్టెంబర్ మధ్యాహ్నం 2.49 వరకు ఉంటుంది. ఏకాదశి రోజు పూజ చేసేందుకు అనుకూలమైన సమయం బ్రహ్మ ముహూర్తం ఉదయం 4.36 గంటల నుంచి 5.24 వరకు ఉంది.
పూజా విధానం
ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుడిలో దీపం వెలిగించండి. విష్ణువును ధ్యానిస్తూ ఉపవాసం ఉండాలని తీర్మానించుకోండి. గంగా జలంతో విష్ణువుకు అభిషేకం చేయండి.
విష్ణుమూర్తికి పూలు, తులసి ఆకులను సమర్పించండి. పూజలో తులసి ఆకులకు విశేష ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తికి పసుపు పువ్వులు, పసుపు బట్టలు, పండ్లు మరియు స్వీట్లు సమర్పించండి. భగవంతుని ఆరతి చేయండి. దేవునికి ఆహారాన్ని సమర్పించండి. భగవంతునికి సాత్విక ఆహారాలు మాత్రమే సమర్పించాలని గుర్తుంచుకోండి. విష్ణుమూర్తికి నైవేద్యాలలో తులసిని తప్పకుండా చేర్చండి. విష్ణువు తులసి లేని ఆహారాన్ని స్వీకరించడు అని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు.
హిందూ గ్రంథాలయ ప్రకారం ఇందిరా ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. వైకుంఠప్రవేశం లభిస్తుంది. పూర్వీకులు స్వర్గం చేరుకుంటారని నమ్ముతారు.
టాపిక్