తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Venus Conjunction: కుజ శుక్రుల కలయిక.. ఈ 6 రాశులకు శుభ సమయం

Mars Venus Conjunction: కుజ శుక్రుల కలయిక.. ఈ 6 రాశులకు శుభ సమయం

HT Telugu Desk HT Telugu

12 May 2023, 10:15 IST

    • Mars Venus Conjunction: కుజుడు శుక్రుడు ఒకే రాశిలో కలవడం వల్ల 6 రాశులకు శుభం జరగనుంది. జూలై 1 వరకు ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటక రాశిలో కుజ శుక్రుల కలయిక
కర్కాటక రాశిలో కుజ శుక్రుల కలయిక

కర్కాటక రాశిలో కుజ శుక్రుల కలయిక

Mars Venus Conjunction: కుజుడు శుక్రుడు ఒకే రాశిలో కలవడం వల్ల 6 రాశులకు శుభం జరగనుంది. జూలై 1 వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. మే 10వ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు శుక్రుడు కూడా ఇదే రాశిలోకి సంచరించనున్నాడు. దీని ద్వారా పలు రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉండబోతున్నాయి.

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

కుజుడిని ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీకగా భావిస్తారు. జూలై 1 వరకు కుజుడు కర్కాటకంలో ఉంటాడు. శుక్రుడు కూడా మే 30న కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడిని సంపద, విలాసం, సంతోషం, సౌభాగ్య కారకుడిగా భావిస్తారు. కర్కాటకంలో ఏర్పడే కుజుడు, శుక్రుడి కలయిక 6 రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మేష రాశి వారికి

కుజుడు, శుక్రుడి కలయిక మేష రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితం ఆనందంగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో పురోగతి సాధించే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.

వృషభ రాశి వారికి

రెండు పెద్ద గ్రహాల కలయికతో వృషభ రాశి వారికి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణ ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులకు శుభ సమయం.

సింహ రాశి వారికి

సింహ రాశి వారికి ఒకే రాశిలో శుక్రుడు, కుజుడు కలవడం శుభ సమయాన్ని తెస్తుంది. ఈ సమయంలో మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ కేసులు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు మంచి సమయం.

కన్యా రాశి వారికి

కన్యా రాశి వారికి ధన సంబంధ సమస్యలు తొలగుతాయి. సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలం కన్యా రాశి వారికి అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.

తులా రాశి వారికి

తులా రాశి జాతకులు పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. పై అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ కాలంలో మీరు అనుకున్నది సాధించడంలో విజయం సాధిస్తారు. ప్రయాణాలతో ప్రయోజనం ఉంటుంది.

కుంభ రాశి వారికి

కుంభ రాశి జాతకుల పనితీరు మెరుగుపడుతుంది. మీ పనికి ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు. మీరు 100 శాతం శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. ప్రయాణాలు సఫలమవుతాయి. శత్రువలపై విజయం మీదే అవుతుంది.

తదుపరి వ్యాసం