Ugadi 2023 Tula Rasi Phalalu : శోభకృత్ నామ సంవత్సరం తులా రాశి ఫలాలు-ugadi 2023 tula rasi phalalu know predictions for sri shobhakrith nama samvatsaram ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Ugadi 2023 Tula Rasi Phalalu Know Predictions For Sri Shobhakrith Nama Samvatsaram

Ugadi 2023 Tula Rasi Phalalu : శోభకృత్ నామ సంవత్సరం తులా రాశి ఫలాలు

HT Telugu Desk HT Telugu
Mar 19, 2023 06:00 AM IST

Ugadi 2023 tula Rasi Phalalu : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం తులా రాశి ఫలాలు ఇక్కడ చదవండి. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

తులారాశి
తులారాశి

తులారాశి వారి ఆదాయం - 14 వ్యయం - 11 రాజపూజ్యం - 7 అవమానం - 7

ట్రెండింగ్ వార్తలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం తులారాశి వారికి ఫలితములు ఈవిధముగా ఉన్నవి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు తులారాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి 7వస్థానమునందు సంచరించుటచేత, శని 5వ స్థానమునందు సంచరించుటచేత, రాహువు కళత్ర స్థానమగు 7వ స్థానము యందు సంచరించుటచేత మరియు కేతువు 1వ స్థానమునందు సంచరించుటచేత తులారాశి వారికి ఈ సంవత్సరంలో శుభఫలితములు ఉన్నవి. తులారాశి వారికి గత కొంతకాలముతో పోల్చుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి.

కళత్ర స్థానములో సంచరించుటచేత బృహస్పతి మరియు పంచమ స్థానములో శని అనుకూలత వలన తులారాశివారికి ఈ సంవత్సరం కుటుంబపరంగా, ఆర్ధికపరంగా, మరియు ఉద్యోగపరంగా శుభఫలితాలు ఉండబోతున్నాయి. జన్మరాశి యందు కేతువు ప్రభావం చేత ఒత్తిళు ఎ) మరియు కుటుంబము నందు భేదాభిప్రాయములు అధికముగా ఉండును. కళత్ర స్థానమునందు రాహువు సంచారము వలన భార్యాభర్తల మధ్య గొడవలు భేదాభిప్రాయములు అధికమగును. అలాగే కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంనందు తులారాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అలాగే ధనలాభము మరియు ఉద్యోగము నందు కీర్తి కలుగును. తులారాశి వ్యాపారస్తులకు ఈ శోభకృత్ నామ సంవత్సరంలో వ్యాపారం లాభదాయకముగా ఉండును. వ్యాపారస్తులకు కొంచెం ఒత్తిళ్ళు అధికమగును. తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమైనటు వంటి ఫలితాలున్నాయి. విద్యార్థులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

తులారాశి స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు, మానసిక ఇబ్బందులు అధికమగును. కుటుంబసభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. తులా రాశి సినీరంగం వారికి అన్ని విధాలుగా కలసి వస్తుంది తులారాశి రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. తులారాశివారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం, బుధవారం రోజు విఘ్నేశ్వరుని పూజించడం, శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం మంచిది.

తులా రాశి మాసవారి ఫలితములు

ఏప్రిల్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అనుకూలించును. ప్రేమ విషయాలలో అసంతృప్తి. అధికారంతో కూడిన ద్యోగం నుండి కొంత గుర్తింపు లభించును. కోర్టు కేసులు అనుకూలించును.

మే : ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో ప్రశంస. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

జూన్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు. వృత్తి వ్యాపారాలలో అనవసర ఖర్చులు. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. అప్పు తీసుకునే అవకాశం.

జూలై : ఈ మాసం మధ్యస్తమునుండి అనుకూలంగా ఉంది. కీర్తి ప్రతిష్ట. సంపద వృద్ధి అగును. ఆర్ధిక సమస్యలనుండి బయటపడతారు. కుటుంబముతో ఆనందము. స్నేహితుల నుండి సహాయం.

ఆగస్టు:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అనుకూలించును. సోదరులు, స్నేహితులు అనుకూలం. అధిక ఆదాయం లభించును.

సెప్టెంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు లాభదాయం. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరైన సమయం. స్నేహితులు సహకరిస్తారు.

అక్టోబర్ : ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. తోబుట్టువుల వలన లాభాలు. శుభవార్తలు వింటారు. నిద్రలేమి వలన శరీరము రుగ్మతలు. విద్యార్థులకు అనుకూలం.

నవంబర్: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగును. స్నేహితుల నుండి ప్రశంసలు. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు.

డిసెంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ల ద్వారా వేతనాలు పెరిగే అవకాశము వృత్తిలో పురోగతి. మంచి ఆరోగ్యం. ప్రయత్నాలు సానుకూలం. ఆదాయంలో వృద్ధి.

జనవరి :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. మీ బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు గౌరవిస్తారు. కుటుంబముతో పుణ్య క్షేత్ర దర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత కలుగును.

ఫిబ్రవరి : - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి. శుభవార్త మరియు ప్రభుత్వం ఉండి సహాయం కలుగుతుంది. మీ తోబుట్టువులతో ఆనందముగా గడుపుతారు.

మార్చి :- ఈ మాసం మీకు మధ్యస్తమునుండి అనుకూలంగా ఉంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. వ్యాపారస్తులకు అనుకూలం. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఆదాయం ఉంటుంది. సంతానం లేనివారికి పుత్ర సంతానం.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం