తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit 2023: కుజ గ్రహ సంచారంతో ఈ మూడు రాశులకు అశుభం

Mars transit 2023: కుజ గ్రహ సంచారంతో ఈ మూడు రాశులకు అశుభం

HT Telugu Desk HT Telugu

11 May 2023, 13:38 IST

    • Mars transit 2023: కుజ గ్రహ సంచారంతో మూడు రాశులకు ఇబ్బందికర పరిణామాలు సంభవించనున్నాయి.
కర్కాటకంలోకి కుజ సంచారం 3 రాశులకు ఇబ్బందికర పరిణామం
కర్కాటకంలోకి కుజ సంచారం 3 రాశులకు ఇబ్బందికర పరిణామం

కర్కాటకంలోకి కుజ సంచారం 3 రాశులకు ఇబ్బందికర పరిణామం

Mars transit 2023: కుజ గ్రహ సంచారం కారణంగా మూడు రాశులకు ఇబ్బందికర పరిణామాలు ఏర్పడనున్నాయి. కుజుడు మే 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈ కుజ సంచారం వల్ల శస్తక్ యోగం ఏర్పడుతుంది. దీనిని అశుభ యోగంగా భావిస్తారు.

లేటెస్ట్ ఫోటోలు

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

కుజ సంచారం మే 10, 2023న ఏర్పడింది. అంటే కుజుడు కర్కాటకంలోకి ప్రవేశించాడు. ఈ గ్రహ సంక్రమణతో కొన్ని రాశులు ఇబ్బందిపడాల్సి వస్తుంది. కుజుడు కర్కాటక రాశిని వీడి జూలై 1న సింహ రాశిలోకి సంచరించే వరకూ ఈ ప్రభావం ఉంటుంది. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఇతర గ్రహాల్లోని ఆరు లేదా ఎనిమిదో ఇంట్లో ఉంటే దానిని శనక్తక యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం వల్ల ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతాయి. ఆరోగ్య, ఆర్థిక, బంధాల, వృత్తి జీవితాల్లో ఇబ్బందులు కలుగుతాయి. కుజ సంచారం వల్ల ఏర్పడిన ప్రస్తుత యోగం వల్ల ఏయే రాశులకు అశుభమో ఇక్కడ చూడండి.

మిథున రాశి వారికి ఇలా..

కర్కాటక రాశిలో కుజ సంచారం ధన సంబంధిత విషయాల్లో వివాదాలను తీవ్రతరం చేస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటంబంంలో కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకోవాల్సి వస్తుంది. ఈ కాలంలో డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహ రాశి వారికి ఇలా..

సింహ రాశి వారు తమ పన్నెండో ఇంట్లో కుజ సంచారాన్ని అనుభవిస్తారు. ఈ కారణంగా సింహ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. భవన నిర్మాణంలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేసే వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో నివసించే వ్యక్తులు వివాదాలకు దూరంగా ఉండాలి.

ధనుస్సు రాశి వారికి ఇలా..

కుజుడు ధనుస్సు రాశికి అశుభంగా పరిగణించే ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు. దీని ఫలితంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా రక్తపోటు ఉన్న వారు నిర్లక్ష్యాన్ని వీడాలి. వెంటనే వైద్య సాయం పొందాలి. అత్తమామలతో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో వైవాహిక జీవితంలో కొంత అలజడి ఏర్పడుతుంది. డబ్బును పెట్టుబడిగా పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.

తదుపరి వ్యాసం