Sun Transit: సూర్య గ్రహ సంచారం.. మే 15 నుంచి వీరికి మంచి రోజులు
Sun Transit: సూర్య గ్రహ సంచారం నేపథ్యంలో మే 15 నుంచి నాలుగు రాశులకు మంచి రోజులు రానున్నాయి.
Sun Transit: సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచరించే సమయం ఆసన్నమైంది. మే 15న ఈ గ్రహ సంచారం వల్ల పలు రాశులకు మంచి రోజులు రానున్నాయి. ఏయే రాశులకు ప్రయోజనం కలుగుతుందో ఇక్కడ చూడండి.
గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తాడు. అంటే ఒక రాశిలో తిరిగి సంచరించడానికి ఏడాది కాలం పడుతుంది. ఈ నెల 15న సూర్యుడు మేష రాశిని విడిచిపెట్టి ఉదయం 11.32 గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్య గ్రహ సంచారం వల్ల పలు రాశులకు కలిసి రానుంది.
కర్కాటక రాశి వారికి ఇలా
కర్కాటక రాశి వారికి సూర్యుడు రెండో ఇంటికి అధిపతి. 11వ ఇంటిలో సంచరిస్తాడు. అందువల్ల అనుకున్న లక్ష్యాలను సాధించే సమయం వచ్చింది. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అన్ని దిశల నుంచి డబ్బు లభిస్తుంది. సూర్య గ్రహ సంచారం కర్కాటక రాశి వారికి ధన యోగం కలిగిస్తుంది. 11వ ఇంటి అధిపతి అయిన శుక్రుడి బలం కూడా వ్యక్తిగత జాతకంలో బాగుంటే మీ సంపద మరింత పెరుగుతుంది.
సింహరాశి వారికి ఇలా..
సింహరాశి వారికి సూర్యుడు లగ్నానికి అధిపతి. పదో ఇంట్లో సంచరిస్తాడు. ఈ పరిణామం వల్ల మీ మీ కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పనిలో మీ స్థానాన్ని, కీర్తిని బలోపేతం చేస్తుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతుంటే ఈ కాలంలో మీ కల నెరవేరుతుంది. మీరు ఆ ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
కన్యా రాశి వారికి సూర్యగ్రహ సంచార ఫలితం
కన్యా రాశి జాతకులకు సూర్యుడు 12వ ఇంటికి అధిపతి. తొమ్మిదో ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంచార సమయంలో కన్యారాశి జాతకులు మతం, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మొగ్గు చూపుతారు. ఈ సమయంలో మీ నిర్ణయాలను ప్రభావితం చేయడంలోగానీ, మీ వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో గానీ ముఖ్య పాత్ర పోషిస్తారు. ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన కన్యా రాశి జాతకులు వారి కార్యాలయంలో ప్రశంసలు, గౌరవాన్ని పొందుతారు.
సూర్య గ్రహ సంచారంతో ధనుస్సు రాశి వారికి ఫలితాలు
ధనుస్సు రాశి వారికి సూర్యుడు తొమ్మిదో ఇంటికి అధిపతి. ఆరో ఇంట్లో సంచరిస్తాడు. శత్రువులు ఎంత బలంగా ఉన్నప్పటికీ వారిపై మీరు విజయం సాధించడానికి ఈ పరిణాం ఉపయోగపడుతుంది. ధనుస్సు రాశి వారు తమ వృత్తిలో విజయాన్ని సాధిస్తారు. పెండింగ్ కేసులు, కోర్టు సంబంధిత విషయాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి.
సంబంధిత కథనం