తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Magha Purnima 2023 Rituals : మాఘమాసంలో పౌర్ణమిరోజు ఆ పనులు చేస్తే చాలా మంచిదట.. మాఘపౌర్ణమి ఎప్పుడంటే..

Magha Purnima 2023 Rituals : మాఘమాసంలో పౌర్ణమిరోజు ఆ పనులు చేస్తే చాలా మంచిదట.. మాఘపౌర్ణమి ఎప్పుడంటే..

31 January 2023, 7:15 IST

    • Magha Purnima 2023 : ప్రతి పౌర్ణమికి ఏదొక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి కూడా విశిష్టత ఉంది. మరి ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? పూజ ముహూర్తం ఎప్పుడూ? ఆ రోజు ఏమి చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
మాఘ పౌర్ణిమ పూజ విధి
మాఘ పౌర్ణిమ పూజ విధి

మాఘ పౌర్ణిమ పూజ విధి

Magha Purnima 2023 Significance : మాఘ పౌర్ణమిని హిందూ క్యాలెండర్​లో ముఖ్యమైన రోజుగా చెప్తారు. దీనిని మాఘమాసంలో చివరి, అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. అయితే ఈ మాఘపౌర్ణమిని 2023లో ఏరోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. ముహూర్తం ఎప్పుడూ? ఎలా పూజిస్తే.. పుణ్యఫలితాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం.

లేటెస్ట్ ఫోటోలు

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

Ego Rasis: ఈ రాశుల వారికి కాస్త ఇగో ఎక్కువే.. ఎవరి మాట వినరండోయ్

May 03, 2024, 03:37 PM

మత గ్రంథాలు మాఘ మాసంలో చేసే పవిత్ర స్నానం, తపస్సు వైభవానికి చాలా విశిష్టత ఉందని తెలిపాయి. అందుకే మాఘ పౌర్ణమిరోజు పుణ్యస్నానం చేయడం వల్ల సూర్యచంద్రుల వల్ల కలిగే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. గంగా, యమునా, సరస్వతి నదీ సంగమ ప్రదేశమైన ప్రయాగ వద్ద.. మాఘ పౌర్ణమిరోజు పవిత్ర స్నానం, దానం, గోవు, గృహదానం వంటి కొన్ని ఆచారాలను ఆచరిస్తారు. మాఘమాసంలో ప్రతి రోజు దానధర్మాలు చేయడం విశేషమని విశ్వసిస్తారు. కాబట్టి మాఘ పూర్ణిమ రోజు కూడా మీరు దానధర్మాలు చేయవచ్చు.

మాఘ పౌర్ణమి 2023 శుభ ముహూర్తం

* మాఘ మాసం పౌర్ణమి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 4, 2023, రాత్రి 09:29 నిమిషాలకు

* మాఘ మాసం పౌర్ణమి ముగింపు : ఫిబ్రవరి 5, 2023 రాత్రి 11: 58 నిమిషాలు

* ఉదయ తిథి ప్రకారం.. మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 5, 2023 న చేసుకుంటారు.

* ఆయుష్మాన యోగం: సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 02:41 వరకు

* శుభ యోగం: ఫిబ్రవరి 6 మధ్యాహ్నం 02:41 నుంచి 03:25 వరకు.

మాఘ పౌర్ణిమ 2023 పూజ విధి

మాఘమాసంలో పౌర్ణమిరోజు సూర్యోదయానికి ముందు పవిత్ర నదిలో స్నానం చేయాలి. స్నానం తర్వాత సూర్య మంత్రాన్ని జపిస్తూ.. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. స్నానం చేసిన తరువాత ఉపవాస వ్రతం చేసి శ్రీకృష్ణుని పూజించాలి.

పేదలకు, నిరుపేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానధర్మాలు చేయవచ్చు. నువ్వులు, నల్ల నువ్వులు ప్రత్యేకంగా దానం చేయాలి. మాఘమాసంలో నల్ల నువ్వులతో హవనాన్ని ఆచరించి.. పూర్వీకులకు నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. గాయత్రీ మంత్రం లేదా 'ఓం నమో నారాయణ్' మంత్రాన్ని నిరంతరం 108 సార్లు జపించాలి.

మాఘ పౌర్ణిమ 2023 ప్రాముఖ్యత

మాఘ పౌర్ణిమ జ్యోతిష్య శాస్త్రంలో ఎంత ముఖ్యమైనదో.. మత పరంగా కూడా అంతే ముఖ్యమైనది. పురాణాల ప్రకారం.. చంద్రుడు ఈ రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మాఘ పౌర్ణిమ నాడు పుణ్యస్నానం చేయడం వల్ల సూర్యచంద్రులకు సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. మాఘ పౌర్ణిమ రోజు గంగా స్నానం చేయడం వల్ల శరీరానికి బలం, శక్తి లభిస్తుందని అంటారు. అంతేకాకుండా.. మాఘ పూర్ణిమ గంగా స్నాన పూర్ణిమ రోజు పుష్య నక్షత్రం ఉంటే.. ఆ రోజుకు మరింత పవిత్రత ఉంటుంది.