తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips For Happy Life: ప్రతిరోజూ ఈ 6 పనులు చేశారంటే మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పది రెట్లు పెరుగుతుంది

Vastu tips for happy life: ప్రతిరోజూ ఈ 6 పనులు చేశారంటే మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పది రెట్లు పెరుగుతుంది

Gunti Soundarya HT Telugu

19 March 2024, 14:11 IST

    • Vastu tips for happy life: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ కుటుంబంలో సంతోషం నిండి ఉంటుంది. అదే నెగటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం బాధలు, కష్టాలు, సమస్యలతో నిండిపోతుంది. అందుకే మీ ఇల్లు సంతోషంగా ఉండాలంటే ఈ ఆరు పనులు తప్పకుండా చేయండి. 
ఈ పనులు చేశారంటే ఇంట్లో ఆనందమే
ఈ పనులు చేశారంటే ఇంట్లో ఆనందమే (pixabay)

ఈ పనులు చేశారంటే ఇంట్లో ఆనందమే

Vastu tips for happy life: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యం పెరుగుతాయి. అదే ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే మనశ్శాంతి కరువవుతుంది. ఆర్థికంగా నష్టపోతారు. కష్టాలు, సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. సంతోషం ఆవిరైపోతుంది. ప్రతికూల శక్తి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే నెగిటివ్ ఎనర్జీ పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉంటే సంతోషం, శ్రేయస్సు పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

పాజిటివ్ ఎనర్జీ పెంపొందించుకోవడం కోసం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని సులభమైన చర్యలు పాటించాలి. ఈ ఆరు నియమాలు పాటించడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు ఎటువంటి ఢోకా ఉండదు. అందుకే ఈ ఆరు పనులు తప్పకుండా చేయండి.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి

ఇంట్లో ఉండే మురికి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అందుకే ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ముఖ్యంగా కిచెన్‌లో ఎంగిలి పాత్రలు ఎప్పుడూ ఉండకూడదు. కిచెన్‌ను వాస్తు ప్రకారం సర్దుకోవాలి. అదే సమయంలో అనవసరమైన వస్తువులను నిల్వ చేయకూడదు. ఇంటి నుండి చెత్తను తీసి బయట పారేయాలి. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

దీపం వెలిగించాలి

ప్రతి ఒక్కరూ ఉదయం పూట పూజ చేసుకునేటప్పుడు దీపం వెలిగిస్తారు. కానీ దీపం సాయంత్రం పూట కూడా వెలిగించడం మంచిది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ఇంటిముందు చీకటి లేకుండా చూసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు వెలుతురుగానే ఉండాలి. సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీప వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

తోరణం కట్టాలి

ఇంటికి తోరణం అనేది అందాన్ని మాత్రమే కాదు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టేందుకు మీరు మామిడి ఆకులతో ఒక తోరణాన్ని తయారుచేసి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి. మామిడి ఆకులు ఎండిపోయిన ప్రతిసారి తోరణాన్ని మార్చుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తోరణంలో ఉపయోగించే ఆకులు ఆకుపచ్చగా ఉండాలి. చెడిపోయినవి, ఎండిపోయినవి తీసేయాలి.

ఉప్పు

ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ప్రతిరోజు ఇంటిని తడి వస్త్రం వేసి తుడుచుకోవాలి. ప్రతిరోజు మీ ఇంట్లో శ్రమతో కూడిన వాతావరణం ఉంటే దాని వెనుక ఇంట్లో ప్రతికూల శక్తి కారణం కావచ్చు. అందుకే మీరు ఇల్లు ఊడ్చిన తర్వాత ఇల్లు తుడుచుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఇల్లు తుడవటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

సూర్యునికి నీరు సమర్పించాలి

ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో సూర్యగ్రహ స్థానం బలపడుతుంది. సూర్యుడు స్థానం బలంగా ఉంటే సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట రెట్టింపు అవుతాయి. సూర్యదేవుడు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. అయితే అర్ఘ్యం సమర్పించే నీరు కాళ్ళ మీద పొరపాటున కూడ పడకూడదు.

తులసి పూజ

ప్రతిరోజు తులసిని పూజించాలి. ఉదయం, సాయంత్రం తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించాలి. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అలాగే శుక్రవారం ఉపవాసం ఉండి లక్ష్మి సూక్తం పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం