తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Zodiac Signs: మీ రాశికి తగిన రాశి వారెవరో తెలుసుకోండి క్యూట్ అండ్ బెస్ట్ కపుల్ అనిపించుకొండి

zodiac signs: మీ రాశికి తగిన రాశి వారెవరో తెలుసుకోండి క్యూట్ అండ్ బెస్ట్ కపుల్ అనిపించుకొండి

Ramya Sri Marka HT Telugu

Published Nov 27, 2024 11:32 AM IST

google News
    • Zodiac signs: వివాహ బంధమైనా, ప్రేమ బంధమైనా బలంగా ఉండాలంటే కేవలం మనసులు కలిస్తే సరిపోదు. ఇద్దరు వ్యక్తుల జాతకాలు రాశులు కూడా కలవాలి. మీ రాశి ప్రకారం మీకు ఏ రాశి వారు కరెక్ట్ జోడీ అవుతారో తెలుసుకొండి.
మీ రాశికి తగిన రాశి వారెవరో తెలుసుకోండి

మీ రాశికి తగిన రాశి వారెవరో తెలుసుకోండి

వివాహ బంధమైనా, ప్రేమ బంధమైనా బలంగా ఉండాలంటే ఒకేలాంటి ఆలోచనా తీరు ఉండాలి. లేదా పరస్పరం గౌరవం ఇచ్చుకునే స్వభావం ఉండాలి. దీన్నే మనసులు కలవడం అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలంటే మనుసులు కలవడంతో పాటు వారి జాతకాలు కూడా కలవడం ముఖ్యం.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన సమయాన్ని బట్టి ఒక్కో వ్యక్తి ఒక్కో రాశికి చెంది ఉంటాడు. రాశులను బట్టి ఆయా వ్యక్తుల స్వభావాలు వేరు వేరుగా ఉంటాయి. అలా 12 రాశులలో ఒక రాశితో ఇంకొక రాశికి అన్యోన్యమైన రిలేషన్ ఉంటుంది. ఏ రాశి వారికి ఏ రాశి వారు కరెక్ట్ జోడీ అవుతారో తెలుసుకుంటే జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. మీ రాశికి తగిన జోడీ ఎవరో తెలుసుకుని రియల్ లైఫ్‌లో అలాంటి వాళ్లు తారసపడితే అస్సలు వదలకండి. రాశుల మధ్య సరైన సమన్వయం కుదిరితే పరస్పర అనుకూలత, సహకారం, అనుకూలమైన పరిస్థితులు, సానుకూల మనోభావం, సమస్యల పరిష్కారం దిశగా ప్రయాణాలు సాగుతాయి. మీ రాశిని బట్టి మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీకు సరితూగగలిగే రాశులేంటో తెలుసుకోండి.


లేటెస్ట్ ఫోటోలు

అక్టోబర్ 14 రాశి ఫలాలు.. ఏ రాశి వారికి అనుకూలం, ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి!

Oct 13, 2025, 08:43 PM

3 యోగాలు- ఈ 5 రాశులకు మారనున్న తలరాత- ఘనంగా లాభాలు, ప్రమోషన్స్, ఉద్యోగ బదిలీ- విదేశీ ప్రయాణం, సంతోషమయ జీవితం!

Oct 12, 2025, 02:49 PM

అక్టోబర్ 11 రాశి ఫలాలు.. అన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు.. కొత్త అవకాశాలు, ఆత్మవిశ్వాసంతో ముందడుగు

Oct 10, 2025, 08:20 PM

అక్టోబర్ 10 రాశి ఫలాలు.. ఈ ఒక్క రాశి వారికే కాస్త అదృష్టం.. మిగిలిన రాశుల వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Oct 09, 2025, 08:21 PM

అక్టోబర్ 9 రాశి ఫలాలు.. ఈ ఏడు రాశులకు అదృష్ట కలిసి వచ్చే రోజు.. ప్రతి పనిలో విజయం, వ్యాపారాల్లో లాభాలు

Oct 08, 2025, 08:17 PM

అక్టోబర్ 8 రాశి ఫలాలు.. ఈ ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు.. ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో చూడండి

Oct 07, 2025, 08:51 PM

మీన రాశి - వృశ్చిక రాశి

మీనం, వృశ్చికం వీరిద్దరి మధ్య బంధం చాలా లోతుగానూ, ఉత్సుకతతోనూ నిండి ఉంటుంది. ఇరు రాశుల చిహ్నాలకు నీటిలో ఉండే స్వభావం ఉండటంతో ఎమోషనల్‌గా, ఆధ్మాత్మికంగా ఒకరితో ఒకరు బలంగా ముడిపడి ఉంటారు. ఈ బంధంలో ప్రేమ లోతుల్ని చూడటమే కాదు, అంతకు మించిన ఆనందాన్ని రుచి చూస్తారు.

వృషభ రాశి - కర్కాటక రాశి

ఈ రెండు రాశుల వారు ఒకరికొకరు భద్రతా భావంతో ఉంటారు. ఇద్దరి మధ్య ఒక కంఫర్టబుల్ రిలేషన్‌ను సృష్టించుకుంటారు. వృషభ రాశి ఎప్పుడూ స్థిరత్వాన్ని అందిస్తుంటే కర్కాటకం భావోద్వేగపూరితంగా, ప్రేమ పూర్వకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ రెండు రాశుల వారు కలిస్తే క్యూట్ అండ్ బెస్ట్ కపుల్ అనిపించుకోవచ్చు.

సింహ రాశి - ధనుస్సు రాశి

ఒకరికొకరు కాంప్రమైజ్ కానీ స్వభావమున్న రాశులు సింహం, ధనుస్సు. ఉత్సాహపూరితమైన ప్రేమ, సరదాలను ఇష్టపడుతుంటారు. సింహ రాశి యథేచ్ఛగా వ్యవహరించే వైఖరి, ధనుస్సు రాశి స్వేచ్ఛాయుత స్వభావంతో సరిగ్గా సరిపోలుతుంది. ఈ రాశుల జోడీ మధ్య ఏర్పడే బంధం శక్తివంతంగా ఉంటుంది.

తుల రాశి - కుంభ రాశి

ఈ రెండు రాశుల వారు మేధావులు, సామాజిక స్పృహ ఉన్న వారు. ప్రేమతో కూడిన ఆలోచనల సంభాషణ వీరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వారు చేయాలనుకున్న పనిని సుస్పష్టంగా, వినూత్నంగా భాగస్వాముల ముందుంచగలరు కాబట్టి రిలేషన్ దృఢంగా కొనసాగుతుంది.

కన్య రాశి - మకర రాశి

నిరాడంబరంగానూ, ఉత్సుకతతోనూ వ్యవహరించే ఈ రాశుల వారు కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు రాబడతారు. మకర రాశి వారి ఆలోచనలకు కన్య రాశి దగ్గరగా ఉండటంతో భాగస్వామి కలలను సాకారం చేయడంలో సక్సెస్ అవుతారు. స్థిరమైన, విజయవంతమైన పార్టనర్‌షిప్ కొనసాగిస్తారు.

సమస్యలను పరిష్కరించే సదుపాయాలను పెంచుకోవడం, ప్రతికూలత చూపించే అంశాలను తగ్గించుకోవడం వల్ల జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. ఒకరు భాగస్వామి కాబోతున్నారనే ముందు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసుకోవడం వల్ల జీవనం సజావుగా గడుస్తుంది.

(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)