Pair of fish for wealth: చేపల జత చిహ్నం ఇంట్లో వేలాడదీశారంటే సంపదకి ఏ లోటు ఉండదు
13 December 2023, 8:00 IST
- Pair of fish for wealth: చేపలు సంపదకి చిహ్నంగా భావిస్తారు. అందుకే వాటిని ఇంట్లో పెట్టుకుంటే సంపదకి లోటు ఉండదు.
చేపల జత చిహ్నం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది?
Pair of fish for wealth: ఇంట్లో అక్వేరియం ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అక్వేరియం ఆకర్షిస్తుంది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని కారణాల వల్ల చేపలను అక్వేరియంలో ఉంచలేని వాళ్ళు చేప జత చిహ్నాన్ని పెట్టుకోవచ్చు.
ఫెంగ్ షూయి ప్రకారం చేపల జత చిహ్నం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొండటంలో సహాయపడుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. చేపల జత చిహ్నాన్ని ఇంట్లో వేలాడదీయండ వల్ల ఇంటి సభ్యులకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంట్లో సంపద పెరుగుతుంది.
ఏ దిశలో చేపల జత చిహ్నం పెట్టాలి?
గురువారం, శుక్రవారాల్లో చేపల జతని ఇంటికి తీసుకొస్తే మంచిది. ఇది శుభఫలితాలు ఇస్తుంది. మీకు కలిగే అన్ని అడ్డంకుల నుంచి ఉపశమనం పొండటంలో సహాయపడుతుంది. ఈ చేపల జత చిహ్నాన్ని తూర్పు, ఉత్తర దిశలలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఇలా చేస్తే కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. మెటల్ గోల్డ్ ఫిష్ జతల చిహ్నాన్ని వేలాడదీస్తే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉండవు.
చేపలు శుభప్రదంగా, సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో వీటిని వేలాడదీయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చేపలు నీటి మూలకంతో సంబంధం కలిగి ఉంటాయి. నీరు శాంతి సామరస్యాన్ని అందిస్తుంది. ఫెంగ్ షూయి ప్రకారం చేపల జత ఇంట్లో లేదంటే కార్యాలయంలో పెట్టడం వల్ల ప్రతికూల శక్తి సానుకూల శక్తిగా మారుతుంది. ఇంట్లోని వ్యక్తుల సామర్థ్యం, మానసిక శక్తి పెరుగుతుంది. తూర్పు లేదా ఉత్తర దిశలో వేలాడ దీయొచ్చు. ఉత్తర, ఈశాన్య దిశల మూలలో వేలాడదీయడం వల్ల ఇంటి సభ్యుల అదృష్టం పెరుగుతుంది.
విపత్తుల నుంచి రక్షణ
నీటిలో నివసించే చేపలు మీన రాశి రూపంలో ఉంటాయి. మీన రాశి దేవతల గురువు బృహస్పతి రాశికి అధిపతిగా ఉంటాడు. బృహస్పతిని ఒక శుభ్ర గ్రహంగా భావిస్తారు. జ్ఞానవంతులుగా మారతారు. సమాజంలో ఆనందం, శ్రేయస్సు, గౌరవం, ప్రతిష్ట పొందుతాడు. గురువారం ఒక జత చేప చిగనాన్ని ఇంట్లో లేదంటే ఆఫీసులో పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. చేపల జత చిహ్నం ఇంట్లో తగిలించడం వల్ల ఇంటి సభ్యులు విపత్తుల నుంచి రక్షించబడతారు.
ధనప్రాప్తి
నీరు స్థిరమైన చోటు ఉండదు. అలాగే శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు. చంచలమైనదిగా పిలుస్తారు. చేపలు నీటితో ముడి పడి ఉండటం, విష్ణుమూర్తి మత్స్యావతారం రూపం కావడం వల్ల సంపదని ఆకర్షిస్తుంది. సంపదకి ఛిహమ్ లక్ష్మీదేవి. ఆమె మహా విష్ణువు భార్య కారణంగా చేపల్ని ఏ విధంగానైనా సేవిస్తే డబ్బుకు సంబంధించి అదృష్టం పొందుతారు. జత చేపల చిహ్నం ఇంట్లో పెట్టుకుంటే కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయి.
కెరీర్ లో విజయం సాధించాలంటే
కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలనుకున్నా, కెరీర్ లో విజయం సాధించాలనుకుంటే ఇంటి గోడపై ఒక జత చేప చిత్రాన్ని లేదా పెయింటింగ్ పెట్టుకోవచ్చు. అదృష్టం, జీవితంలో ఇబ్బందులు తొలగిపోవాలంటే వాస్తు ప్రకారం ఇంటికి వెండి లేదా ఇత్తడితో చేసిన ఒక జత చేపలను తీసుకురావచ్చు. ఇది కుటుంబ బంధాలని బలపరుస్తుంది.