Kharma masam: ఖర్మ మాసంలో ఇవి దానం చేశారంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి
16 December 2023, 9:04 IST
- Kharma masam: ఖర్మ మాసంలో పూజలతో పాటు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల అదృష్టం తెస్తుంది. మీ కష్టాలు తొలగిపోతాయి.
ఖర్మ మాసంలో వీటిని దానం చేయండి
Kharma masam: అశుభరకమైన నెలగా భావించే ఖర్మలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు ఖర్మ రోజులు అంటారు. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే సమస్యలు వస్తాయని నమ్ముతారు. అయితే ఖర్మలో రోజుల్లో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే దేవతల అనుగ్రహం పొందుతారు. సూర్య భగవానుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు.
ఖర్మ రోజుల్లో పూజలు మాత్రమే కాదు దానాలు చేయడం వల్ల వాళ్ళు చేసిన పాపాల నుంచి విముక్తి పొందవచ్చు. ఎవరైతే ఈ నెలరోజులు దానాలు, పూజలు చేస్తారో వారిపై ఆ మాసపు దుష్పలితాలు ఉండవని చెబుతారు. ఈ నెల రోజులు మీకు ఈ వస్తువులు దానం చేయడం వల్ల గొప్ప ఫలితం లభిస్తుంది.
వెండి పాత్రలు
ఈ నెలలో వెండి పాత్రలు దానం చేయడం వల్ల సదరు వ్యక్తికి మనశ్శాంతి లభిస్తుంది. అతని ఇల్లు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
బంగారం
ఒక కంచు పాత్రలో కొంత బంగారాన్ని దానం చేయడం వల్ల మీ ఇంట్లోని డబ్బు ఎప్పటికీ తరిగిపోదు. ఇది మాత్రమే కాదు ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
శనగలు
ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కోసం కొద్దిగా నల్ల శనగలు లేదా శనగపప్పు దానం చేయవచ్చు. ఉత్తమ ఫలితాలు పొందటం కోసం ఈ రెండు పదార్థాలు అవసరంలో ఉన్న పేద వ్యక్తికి దానం చేయాలి.
ఖర్జూరం
ఈ కాలంలో కొన్ని ఖర్జూరాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబసభ్యుల మధ్య ప్రేమ పూర్వక వాతావరణం ఏర్పడుతుంది.
బెల్లం
ఖర్మ మాసంలో కొంత బెల్లం దానం చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అది మాత్రమే కాదు బెల్లం దానం చేయడం వల్ల మీకు ఎక్కువ ఆహారం లభిస్తుంది.
అష్టగంధ
ఈ కాలంలో కొంత అష్టగంధ దానం చేస్తే పేదరికం తొలగిపోతుందని చెప్తారు. చందన్, కేసర్, భీమసేని కర్పూరం, హీనా, అగర్, తులసి, బెల్, దుర్వా వంటి ఎనిమిది సువాసన మూలికల మిశ్రమం ఈ అష్టగంధ.
ఎర్ర చందనం
ఖర్మ నెలలో ఎర్రచందనం దానం చేయడం వల్ల మీ కుటుంబం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తెలివితేటలు, శక్తి లభిస్తాయి.
బంగారు చందనం
బంగారు చందనాన్ని దానం చేయవడం వల్ల మీ పని సామర్థ్యం పెరుగుతుంది. శ్రమకి తగిన ఫలితం పొండటంలో మీకు సహాయపడుతుందని చెబుతారు.
కుంకుమ పువ్వు
కేసర్ లేదా కుంకుమ పువ్వు దానం చేస్తే అదృష్టం పెరుగుతుంది. మీ కుటుంబంలో అంతా మంచే జరుగుతుంది. అన్నీ రంగాల్లో మీరు విజయం సాధిస్తారు.
కసూరి మేతి
కసూరి మేతి దానం చేయడం వల్ల డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. చాలా కాలం పాటు అదృష్టం మీ వెంటే ఉంటుంది. అన్నింటా కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టిన అంతిమ విజయం మీదే అవుతుంది.
గోరచాన్
గోరచాన్ అంటే ఆవు నుంచి సేకరించిన ఒక ద్రవం. ఇది దానం చేయడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మీ పనులు పూర్తి చేయడంలో మరింత ప్రావీణ్యం సంపాదిస్తారు. ఆయుర్వేదంలో గోరచాన్ కి విశిష్ట ప్రాముఖ్యత ఉంది.
సముద్రపు గవ్వలు
కొన్ని సముద్రపు గవ్వలు లేదా శంఖాన్ని దానం చేయడం వల్ల సంతోషంగా ఉంటారు.
గంట
ఇంట్లో లేదా గుడిలో పూజ సమయంలో ఉపయోగించే గంటని దానం చేయడం వల్ల ఆరోగ్యం, సంతోషం కలుగుతాయి. ఇది మీ ఇంటి శాంతిని కాపాడటంలో సహాయపడుతుంది.
ముత్యాలు
ఈ సమయంలో ముత్యాలు లేదా మోతీ దానం చేయడం వల్ల అన్ని రకాల వ్యాధులు నయం అవుతాయి. మానసిక రోగం తగ్గుతుంది. మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది
రత్నాలు
వివిధ రకాల రత్నాలు దానం చేయడం వల్ల ధనవంతులు అవుతారు. ఎంత ఎక్కువ దానం చేస్తే అంత డబ్బు మీకు త్వరగా వస్తుంది.
సత్నాజ
ఏడు రకాల పప్పు, అనాజ్ మిశ్రమం సత్నాజ దానం చేయడం వల్ల మన పూర్వీకులు సంతోషంగా ఉంటారు. మరణించిన మన వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది.